సంక్రాంతి బరిలో చిరు ఏ డేట్ లో రాబోతున్నాడంటే?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.

దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.మరి ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో పెద్ద పండుగకు సినిమాను రెడీ చేస్తున్నాడు.

మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

ఎందుకంటే గాడ్ ఫాదర్ రీమేక్ సినిమా కావడంతో వాల్తేరు వీరయ్య రీమేక్ కాకపోవడంతో అంతా ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది.ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుగుతుంది.

ఇక ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.

మెగాస్టార్ తమ్ముడు రోల్ లో రవితేజ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. """/"/ దీంతో ఇది మల్టీ స్టారర్ అనే చెప్పాలి.

ప్రెజెంట్ మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి సమాచారం బయటకు వచ్చింది.

2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.అయితే డేట్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.

మరి ఈ రిలీజ్ డేట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.ఈ సినిమా సంక్రాంతి మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుంది అంటే జనవరి 13న రిలీజ్ చేసేందుకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్.

మరి దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!