వాల్ నట్స్ తో డయాబెటిస్ కి చెక్!
TeluguStop.com
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి ఆధారంగా ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా అని తేడా లేకుండా 'డయాబెటిస్'తో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.
అధిక ఒత్తిడి ఆలోచనల వల్ల డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిలా మారిపోయింది.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
మీ శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.డాక్టర్ల సలహాలు సూచనలతో పాటు మంచి పోషకాహారంతో పాటు ప్రతిరోజు వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ముప్పు తగ్గించుకోవచ్చు.
వాల్నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.వాల్ నట్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఒమేగా2 ఫ్యాటి యాసిడ్స్ ఇంకా ఫైబర్స్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.
"""/" /
వాల్ నట్స్ లో పాలీ అన్శాచురేటెడ్, మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి రోజుకు ఐదు చొప్పున వాల్నట్స్ తీసుకుంటే ఇందులో ఉన్న న్యూట్రీషియన్స్ శరీరంలోని చక్కెర స్థాయిలను సరైన మోతాదులో ఉంచుతుంది.
కాబట్టి డయాబెటిస్ తగ్గడానికి వాల్నట్ ఒక బెస్ట్ న్యూట్రిషన్ అని చెప్పవచ్చు.అంతే కాకుండా వీటిలో పాలి శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండడం ద్వారా శరీరంలోని బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
వీటిలో ఒమేగా2 ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల ఎటువంటి గుండె సమస్యలు రావు.
ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలోనే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
వీటితోపాటు వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి.
ఇన్ని సుగుణాలున్న వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?