శ్రేయాస్ అయ్యర్‎ను పొగడ్తలతో ముంచెత్తిన వీవీఎస్ లక్ష్మణ్..

కాన్పూర్‌ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది.గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‎లో శ్రేయాస్ అయ్యర్‎ అర్థ సెంచరీతో చెలరేగిపోయాడు.

నిన్న జరిగిన తొలి టెస్టులో భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చతికిల పడ్డారు.

ఆ సమయంలో టీమిండియా పనైపోయిందని భావించారు అంతా.కానీ ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్ తో న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు శ్రేయాస్.

ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ప్రతి బౌలర్ ని ఉతికి ఆరేసాడు.కీలక సమయంలో విలువైన 75 పరుగులు చేసి టీమిండియాని ఆదుకున్నాడు.

దాంతో అతడిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం శ్రేయాస్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.

డెబ్యూ టెస్ట్‎లోనే అద్భుతమైన మానసిక దృఢత్వంతో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేశాడని.ఆ తీరు తనను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చాడు.

సగం మంది కీలక బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ బాట పట్టిన పరిస్థితులలో శ్రేయాస్ తొలి రోజే 75 పరుగులు చేశాడు.

నాటౌట్‌గా నిలిచి వావ్ అనిపించాడని లక్ష్మణ్ శ్రేయాస్ ని పొగిడాడు. """/"/ తొలి టెస్టులో చాలా దూకుడుగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ 7 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు.

దాంతో తక్కువ సమయంలోనే అతడు 75 పరుగులు చేయగలిగాడు.జడేజాతో కలిసి 115 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు.

“అయ్యర్ న్యూజిలాండ్ స్పిన్నర్ల బౌలింగ్ శైలిని పరీక్షించడానికి కొంత సమయం వేచి చూశాడు.

ఆ తర్వాత తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు.తొలి టెస్ట్ మ్యాచ్ లోనే అతను పూర్తి కాన్ఫిడెన్స్ తో ఆడుతూ ఏ దశలోనూ అయ్యర్ పొరపాట్లు చేయలేదు.

” అని పేర్కొన్నాడు.శ్రేయాస్ అయ్యర్ ఏ ఫార్మాట్ క్రికెట్‌లోనైనా తన మైండ్‌సెట్‌ను మార్చుకోగలడని.

ఇప్పటికే అది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది అని లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు.

అతడిని టెస్ట్ లో తీసుకొని మంచి పని చేశారని భారత జట్టుపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు లక్ష్మణ్.

ఆ యూకే యూనివర్సిటీలో పోలీస్‌లు సర్‌ప్రైజ్ రైడ్.. కారణం తెలిస్తే..??