మేజర్ ని మెచ్చిన వివిఎస్ లక్ష్మణ్..!
TeluguStop.com

26/11 ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన సినిమా మేజర్.


అడివి శేష్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేశారు.


సయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ నటించిన ఈ సినిమా జూన్ 3న రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది.
సినిమా వసూళ్ల పరంగానే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ వారి సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ సినిమాని ప్రమోట్ చేశారు.
ప్రస్తుతం ఆ లిస్ట్ లో చేరారు మాజీ క్రికెటర్ వి.వి.
ఎస్ లక్ష్మణ్.మేజర్ సినిమా చూసిన లక్ష్మణ్ తన అనుభూతిని వర్ణిస్తూ ట్వీట్ చేశారు.
ఇప్పుడే మేజర్ సినిమా చూశాను ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇది ఒక ఎమోషన్.
సందీప్ ఉన్నికృష్ణన్ కథ నిజంగా స్పూర్తిదాయకమైనది.అడివి శేష్ గ్రేట్ జాబ్.
దీన్ని మరో లెవల్ కి తీసుకెళ్లారని ట్వీట్ చేశారు వి.వి.
ఎస్ లక్ష్మణ్.అంతేకాదు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని కూడా కామెంట్ చేశారు.
ఆయన ట్వీట్ కు అడివి శేష్ కూడా ఇది ఎక్స్ ట్రా ఆర్డినరీ మూమెంట్ అని.
నేషనల్ ఐకాన్ మా కళని మెచ్చుకున్నారని కామెంట్ పెట్టారు.
ఔను.. ఆ ముగ్గురు ఇష్టపడ్డారు..!