వినాయక్‌ రెండు పడవల ప్రయాణం

యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా కెరీర్‌ ఆరంభంలో స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకున్న వివి వినాయక్‌ ఈమద్య కాలంలో మంచి సక్సెస్‌లను అందుకోలేక పోయాడు.

ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్‌ అవుతూ వచ్చింది.ఖైదీ నెం.

150 చిత్రం ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచినా ఆ సక్సెస్‌ ఆయన ఖాతాలో పడలేదు.

దర్శకుడిగా ప్రయత్నాలు చేయడం మానేసి ఇటీవలే సీనయ్య చిత్రంతో హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యాడు.

నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న వినాయక్‌ దర్శకత్వంకు గుడ్‌ బై చెప్తాడని కొందరు అనుకున్నారు.

కాని రెండు పడవల ప్రయాణం చేయాలని వినాయక్‌ భావిస్తున్నాడు.ఒక వైపు సీనయ్య చిత్రం చేస్తూనే మరో వైపు హీరో వెంకటేష్‌కు కథ చెప్పి ఓకే చెప్పించినట్లుగా సమాచారం అందుతోంది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే మరోసారి వీరు కలిసి సినిమా చేస్తే తిరుగుండదని నిర్మాత ఒకరు భావించారు.

అందుకే వీరిద్దరి కాంబోకు సెట్‌ చేశారు.ప్రస్తుతం వెంకీ కమిట్‌ అయ్యి ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది.

ఆ లోపు వినాయక్‌ స్క్రిప్ట్‌ పూర్తి చేసి వెంటనే సినిమాను ప్రారంభించనున్నారట. """/"/ aవినాయక్‌ గత కొంత కాలంగా దర్శకుడిగా వరుసగా ఫ్లాప్‌లను చవి చూస్తున్నాడు.

ఆయన దర్శకత్వంలో ఫైర్‌ మిస్‌ అవుతుందని, ఈ తరం ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు యాక్షన్‌ కావాలి, కాని వినాయక్‌ ఆ రెండింటిని సమ పాళ్లలో ఇవ్వడంలో విఫలం అవుతున్నాడు.

అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి.మరి ఇప్పుడైనా ఆయన తన లోపాన్ని సరిదిద్దుకుని వెంకటేష్‌తో సినిమా చేస్తాడేమో చూడాలి.

ఒకవైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణంతో రెంటికి పూర్తి న్యాయం చేస్తాడా లేదా మద్యలో ఏదైనా వదిలేస్తాడా అనేది కూడా చూడాలి.

అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే వీసా ఇంటర్వ్యూ స్లాట్లు..