సీనయ్య.. ఎక్కడికెళ్లావయ్యా?

డైరెక్టర్ నుండి హీరోగా మారిన వారు కొంతమంది మాత్రమే టాలీవుడ్‌లో సక్సెస్ అయ్యారు.

వీరిలో ముందుగా చెప్పుకునే పేరు ఎస్వీ కృష్ణారెడ్డి.ఆయన అప్పట్లో తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

ఇక హీరోగా మారి కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.ఆ తరువాత కొంతమంది డైరెక్టర్లు ప్రయత్నంచినా హీరోగా మెప్పించలేకపోయారు.

ఇప్పుడు మరో డైరెక్టర్ ఈ బాటలో పయనించేందుకు రెడీ అవుతున్నాడు.మాస్ చిత్రాలతో టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌లు అందించిన వివి వినాయక్ ప్రస్తుతం హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు.

సీనయ్య అనే సినిమాతో హీరోగా నిరూపించుకునేందుకు వినాయక్ ప్రయత్నిస్తున్నాడు.కానీ ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.

ఈ సినిమాను తెరకెక్కించేందుకు ముందుకొచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుండి బయటకొచ్చేయాలని చూస్తున్నాడట.

దీంతో సీనయ్య సినిమా అటకెక్కేసిందని, ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే అని అంటున్నారు.

కానీ ఏది ఏమైనా ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

దేవర సినిమాకి సైఫ్ అలీ ఖాన్ పాత్ర మైనస్ అవ్వబోతుందా..?