ఓటీటీ కంటెంట్‌ మేకింగ్‌లో బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌

ఈ మద్య కాలంలో పలువురు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీ కంటెంట్‌ పై దృష్టి పెడుతున్నారు.

కొందరు వెబ్‌ సిరీస్‌లు అని కొందరు వెబ్‌ మూవీస్‌ అంటూ నిర్మిస్తున్నారు దర్శకత్వం వహిస్తున్నారు.

వెబ్‌ సిరీస్‌ స్క్రిప్ట్‌లను రెడీ చేసి తమ శిష్యులతో చేయిస్తున్నారు.క్రిష్‌ నుండి మొదలుకుని రాజమౌళి వరకు ఎంతో మంది కూడా ఓటీటీ వైపు చూస్తున్నారు అనే విషయం తెల్సిందే.

తాజాగా ఈ జాబితాలో యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయినటువంటి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ కూడా చేరబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈయన ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.నిన్న మొన్నటి వరకు లూసీఫర్‌ రీమేక్‌కు సంబంధించిన బాధ్యతలు ఈయనకు దక్కాయి అంటూ వార్తలు వచ్చాయి.

ఎందుకు ఓటీటీ లోకి ఈయన ఎంట్రీ ఇస్తాడు అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ ప్రశ్నకు కూడా వారు సమాధానం చెబుతున్నారు.

ఏంటీ అంటే చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌ను వచ్చే ఏడాది చివరి వరకు మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడట.

ఎందుకంటే సాహో దర్శకుడు సుజీత్‌ తీసుకు వచ్చిన స్క్రిప్ట్‌ విషయంలో నిరాశ వ్యక్తం చేశాడు.

అందుకు సంబంధించిన చర్చలు ఇప్పుడు మళ్లీ వేరే దర్శకుడితో చేస్తే బాగోదని భావిస్తున్నారు.

సుజీత్‌ మరో సినిమాను చేసినప్పుడు చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌ మొదలు పెట్టాలని నిర్ణయానికి వచ్చాడట.

"""/"/ అందుకే చిరంజీవి ఆచార్య తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.

ఆ సినిమాను చిరు బర్త్‌డే సందర్బంగా ప్రకటించనున్నారు.అంటే లూసీఫర్‌ చాలా ఆలస్యం అవుతుందని కన్ఫర్మ్‌ అయినట్లే కదా.

అందుకే వినాయక్‌ ఆ గ్యాప్‌ను ఓటీటీ వెబ్‌ సిరీస్‌తో ఫిల్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయి లో వసూళ్లను దక్కించుకుని వెండి తెరపై బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు అనిపించుకున్న వినాయక్‌ ఓటీటీ విషయంలో ఎలాంటి ఫలితాలను చవిచూస్తాడో చూడాలి.

పెళ్లిలో మాస్ స్టెప్స్ తో డాన్స్ అదరగొట్టిన నవ వధువు.. వీడియో వైరల్..