పవర్ స్టార్ సినిమాలో నటుడిగా స్టార్ డైరెక్టర్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ రెండింటిని చక్కగా బాలన్స్ చేస్తున్నాడు.

అంతేకాదు ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వెండితెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

"""/"/ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

అంజలి, నివేతా థామస్, అనన్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా తర్వాత పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుండడంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.

అయితే పవన్ ఈ సినిమా తో పాటు అయ్యప్పనుమ్ కోషియం అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. """/"/ ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

అప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ రూమర్ నిజమే అన్నట్టు కూడా తెలుస్తుంది.ఈ సినిమాలో వివి వినాయక్ పాత్ర పవన్ కళ్యాణ్ కు రానాకు దగ్గరగా ఉంటుందట.

చూడాలి మరి ఈ సినిమాలో వివి వినాయక్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడో.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

వైరల్: ఊసరవెల్లులు జిమ్ చేస్తున్నాయి… అవాక్కవ్వాల్సిందే!