వినాయక్ కొత్త సినిమాకు అసలు సమస్య ఇదేనా.. ఆ రీజన్ల వల్లే వెనక్కు తగ్గుతున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్( VV Vinayak ) గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు వీవీ వినాయక్.
ఇకపోతే ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే.ఈమధ్య పూర్తిగా కోలుకున్న ఆయన చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వం భర ( Visvambara )సెట్స్ లో కనిపించారు.
దాంతో అప్పటినుంచి వీవీ వినాయక్ కొత్త సినిమాపై అనేక రకాల వార్తలు ఊహ గణాలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ వినాయక్ మాత్రం తన కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. """/" /
నిజానికి ఆయనకు కొన్ని ఆఫర్లు ఉన్నాయి.
కొంతమంది హీరోలు సినిమా చేద్దామని స్వయంగా అడిగినా కూడా వినాయక్ మాత్రం తన దగ్గరకొచ్చిన ఆఫర్లన్నింటినీ హోల్డ్ లో పెట్టారట.
అందుకు గల కారణం ఆయన జాతకమట.ప్రస్తుతం ఆయన జాతకంలో గ్రహస్థితులు సరిగ్గా లేవట.
ఇప్పటికే పలువురు జ్యోతిష్యుల్ని ( Astrologers )సంప్రదించగా ప్రస్తుతానికి ఓపిక పట్టండి అంటూ అందరూ కామన్ గా చెప్పారట.
ఇంకొక్క నెల రోజులు ఆగితే వినాయక్ జీవితంలో గ్రహాల మూమెంట్స్ స్టార్ట్ అవుతుందని అందుకే అందర్నీ సెప్టెంబర్ వరకు ఆగాలని ఆయన కోరుతున్నారట.
సో వచ్చే నెల ఆయన తన కొత్త ప్రాజెక్టు ప్రకటించే అవకాశం ఉంది.
"""/" /
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో కలిసి హిందీలో ఛత్రపతి సినిమా( Chhatrapati Movie ) రీమేక్ చేశారు వినాయక్.
బాలీవుడ్ లో అది ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో బాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టకూడదని, మరీ ముఖ్యంగా రీమేక్స్ టచ్ చేయకూడదని వినాయక్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కాగా వినాయక్ కొత్త సినిమా అనౌన్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో నటించనున్న యంగ్ హీరో…