హామీలు అమలు చేశాకే ఓట్లు అడగాలి.. కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏం సాధించారని తుక్కుగూడలో కాంగ్రెస్ సభ పెడుతుందని ప్రశ్నించారు.కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.

పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెబుతున్నారని తెలిపారు.

రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవన్న ఆయన కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు మొదలు అయ్యాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇచ్చిన హామీలు అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలని తెలిపారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే ఎక్కువ గెలవదన్న కిషన్ రెడ్డి కర్ణాటకలో కూడా బీజేపీ( BJP ) ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

దళితులపై అధ్యయనాలు.. భారత సంతతి మహిళా ప్రొఫెసర్‌కు ‘యూఎస్ జీనియస్ గ్రాంట్ ’