92, 96, 97.. ఈ సిరీస్ కోడ్ నెంబర్లతో ఫోన్లు వస్తే జాగ్రత్త!

టెక్నాలజీ వలన మనిషికి మంచితో పాటు కీడు కూడా జరుగుతోంది.ఆ పొరపాటు టెక్నాలజీది మాత్రం కాదు, మనిషిదే.

ఇక్కడ కొంతమంది మోసగాళ్లు తేలికగా డబ్బులు సంపాదించాలనే నెపంతో టెక్నాలజీని ఓ పావులాగా వాడుకుంటున్నారు.

వారు మనకి పక్కనే ఉండి ఫోన్‌ చేసినా.తెలుసుకోవడం కష్టం అవుతోంది ఇపుడు.

అంతలాగా వారు మనల్ని ఏమార్చి గల్లా దోచుకుంటున్నారు.కేటుగాళ్లు ‘వీవోఐపీ’ ఉపయోగిస్తుండటమే దానికి ముఖ్య కారణం అని తెలుస్తోంది.

ముఖ్యంగా బెదిరింపులు, కిడ్నాప్‌ల వంటి నేరాలకు వీవోఐపీ కాల్స్‌( VOIP Calls ) వాడుతుండటం పోలీసులకు సవాల్‌గా మారిందిపుడు.

"""/" / ముఖ్యంగా ఈ కాల్స్‌ను వినియోగించి.సాధారణంగా ఎవరికైనా ఫోన్‌ చేసినప్పుడు సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌కు( Service Provider ) చెందిన సర్వర్‌ నుంచి టవర్ల ద్వారా అవతలి వ్యక్తికి చేరుతుంది.

అప్పుడు ఫోన్ ఎవరు చేశారో నంబర్ అధారంగా తేలికగా గుర్తించవచ్చు.ఏదైనా కంప్యూటర్‌కు అనుసంధానమై, అంతర్జాలం అందుబాటులో ఉంటే చాలు.

వీవోఐపీ కాల్‌ చేసేయొచ్చన్నమాట.అంతేకాదండోయ్.

వారు మానకు కావాల్సిన నంబరు నుంచి కూడా తెలివిగా ఫోన్ చేయొచ్చు.అటువైపు ఉన్న వ్యక్తికి.

ఫోన్‌ చేసిన వ్యక్తి నంబరు కనిపించకుండా కూడా చేయవచ్చు మరి.ఇపుడు సైబర్ నేరగాళ్లు( Cyber Crimes ) అన్ని ట్రిక్కులు వుపయోగించి బురిడీ కొట్టిస్తున్నారు.

"""/" / ఇంకా చెప్పాలంటే వాస్తవానికైతే ఫోన్‌ చేసిన వ్యక్తికి అసలు సిమ్‌ కార్డే( Simcard ) ఉండదు.

కంప్యూటర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది.ఈ కారణంగానే ఎవరు ఫోన్‌ చేశారు.

ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో గుర్తించడం ఇపుడు పెను సవాల్ గా మారింది.

ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే పలువురికి 92, 96, 97 వంటి అంతర్జాతీయ కోడ్‌తో( International Codes ) మొదలవుతున్న నంబర్లతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇక సొమ్ము పోగొట్టుకున్నాక పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నా.వారికి ఏ మాత్రం ఫలితం ఉండటంలేదు.

అందుకే ఇపుడు సైబర్ క్రైం వారు ఈ నెంబర్లతో ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితులలో ఎత్తవద్దని హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ అనుమానాస్పద నంబర్లు అనిపిస్తే.వాటి గురించి వెంటనే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(DOT)కు చెందిన 1800110420, 1800111963 నంబర్లకు తెలియజేయాలి.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?