వొడాఫోన్ ఐడియా నుంచి 3 కొత్త ప్లాన్లు లాంచ్.. వాటి బెనిఫిట్స్ ఇవే!
TeluguStop.com
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫోన్స్ వాడుతున్నారు.ముఖ్యంగా డేటా రోజూ వాడే స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగింది.
ఈ నేపథ్యంలో భారతదేశంలో టెలికాం సంస్థల మధ్య భారీ పోటీ నెలకొంది.తమ ప్రస్తుత కస్టమర్లను పోగొట్టుకోకుండా, అలాగే కొత్త వారిని ఆకర్షించేందుకు పోటాపోటీగా ఎయిర్టెల్, జియో వంటి సంస్థలు కొత్త రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా 3 కొత్త ప్లాన్లను పరిచయం చేసింది.ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఆ ప్లాన్స్ ఏంటి? వాటి బెనిఫిట్స్ వంటి వివరంగా తెలుసుకుందాం.వొడాఫోన్ ఐడియా రూ.
319 అనే మూడు ప్లాన్లను తాజాగా లాంచ్ చేసింది.మొదటగా వొడాఫోన్ ఐడియా రూ.
98 ప్లాన్ తీసుకు రాగా ఇది 15 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది.
మొత్తంగా ఇది 200ఎంబీ డేటా అందిస్తుంది.అన్ లిమిటెడ్ కాల్స్ ఫెసిలిటీ ఉంటుంది కానీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ మాత్రం ఉండవని యూజర్లు గమనించాలి.
"""/"/
వొడాఫోన్ ఐడియా రూ.195 ప్లాన్‌కు మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే.
31 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.కానీ ఇంటర్నెట్ డేటా మాత్రం డైలీ వారీగా కాకుండా మొత్తంగా కేవలం 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
అన్ని మంత్లీ ప్లాన్స్ లాగానే ఇది కూడా అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది.కాకపోతే 300 ఎస్ఎంఎస్లు మాత్రమే ఆఫర్ చేస్తోంది.
ఈ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీ బేసిక్స్ వంటి వాటికి యాక్సెస్ పొందొచ్చు.
31 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వొడాఫోన్ ఐడియా రూ.319 ప్లాన్ రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేస్తుంది.
ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్లు బింజ్ ఆల్‌నైట్, డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?