నన్ను రెచ్చగొట్టి ఎర్రి పుష్పం చేస్తున్నారు.. సన్నీ షాకింగ్ కామెంట్స్ వైరల్?

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా సన్నీ ఎంతో పోటీ పడుతున్నప్పటికీ సంచాలకులుగా ఉన్నటువంటి వారు మాత్రం సన్నీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అతనితో గొడవకు దిగుతున్నారు.

ఈ క్రమంలోనే గత రెండు వారాలలో జెస్సీ, అనీ మాస్టర్ సన్నీతో ఎంతో గొడవపడి రచ్చ రచ్చ చేశారు.

తాజాగా రవి కూడా సన్నీతో ఆడుకుంటున్నాడు.స్విమ్మింగ్ పూల్ లో దిగి ఎవరు ఎక్కువ టీ షర్ట్లు ధరిస్తే ఆ టాస్క్ లో వాళ్ళ విజేత అంటూ బిగ్ బాస్ సూచించడంతో అందులో టీషర్ట్ సరిగా వేసుకోలేదని ఆట మధ్యలో కొత్త రూల్స్ చెబుతూ రవి సన్నీని డిస్ క్వాలిఫై చేస్తూ మానస్ ను గెలిపించారు.

దీంతో రవిపై సన్నీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా రవి శ్రీరామ్ అనీమాస్టర్ మాట్లాడుతుండగానే సూపర్ పవర్ దక్కించుకున్న రవికి బిగ్ బాస్ ఒక టూల్ ఇస్తారు.

అయితే తనకు లభించిన పవర్ టూల్ తన కోసం కాకుండా ఎవరికైనా ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో ఆ అవకాశాన్ని సన్నీకి కల్పిస్తాడు.

ఈ క్రమంలోనే ఆ టూల్ తీసుకోవాలని రవి చెప్పినప్పుడు అందుకు సన్నీ నిరాకరిస్తాడు.

నేను తీసుకొని మామ అంటే తప్పకుండా తీసుకోవాలి ఇది బిగ్ బాస్ ఆ దేశమని రవి సూచిస్తాడు.

ఆ పవర్ టూల్ ద్వారా గోల్డ్ మైనింగ్ లో పోటీ పడే వాళ్లలో ఒకరిని తొలగించి వారి స్థానంలో సన్నీ వెళ్లి గోల్డ్ కాయిన్స్ సంపాదించవచ్చని చెబుతారు.

"""/"/ ఈ విషయం తెలుసుకున్న సన్నీ నేను ఈ పోటీలో దిగను ఈ పవర్ టూల్స్ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పడంతో అందుకు రవి ఒప్పుకోలేదు.

దీంతో ఏం చేయాలో సన్నీకి దిక్కు తెలియక బయట గార్డెన్ లో కూర్చుని బిగ్ బాస్ సార్ ఆయనకి నేను ఎందుకు నచ్చడం లేదు ఎంతోమంది స్ట్రిక్ట్ సంచాలకులు కూడా అంత బిల్డప్ ఇవ్వరు.

ఈ పవర్ టూల్స్ ద్వారా రెచ్చగొట్టి పంపిస్తారు చివరికి నన్ను ఒక ఎర్రి పుష్పం చేస్తారు.

బికాస్ ఐ యామ్ పూర్ బాయ్ అంటూ సన్నీ తనలో తాను పాట పాడుకుంటూ కనిపిస్తారు.

మరి నేడు జరగబోయే ఎపిసోడ్ లో గోల్డ్ మైనింగ్ లో కి పవర్ టూల్స్ ద్వారా ఎవరు దిగుతారు అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే5, ఆదివారం 2024