Vj Sunny : కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న బిగ్ బాస్ విన్నర్.. అవసరమా అంటూ భారీగా ట్రోల్స్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ( Vj Sunny ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారీటిని సంపాదించుకున్నాడు వీజే సన్నీ.

అయితే బిగ్ బాస్ షో( Bigg Boss Show )తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీకి బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత నుంచి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా( Social Media )లో సన్నీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే సన్నీ త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియోను కూడా షేర్ చేశారు.

నేను మీతో ఒక న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను.ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని నేను కూడా నా సొంత పార్టీని స్టార్ట్ చేయబోతున్నాను.

బుధవారం మధ్నాహ్నం 2 గంటలకు నా పార్టీ అనౌన్స్‌మెంట్ జరగబోతోంది.మీ అందరికీ మరింత దగ్గరవడానికి ఒక ప్రయత్నంగా ఒక పార్టీని ప్రారంభించబోతున్నాను.

మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. """/" / అంటూ వీజే సన్నీ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఆ వీడియో చూసిన ఆయన అభిమానులు కొందరు వీజే సన్నీకి శుభాకాంక్షలు చెబుతుండగా, మరికొందరు మాత్రం ఆ ప్రకటన సినిమా లేదా వెబ్‌సిరీస్‌కు సంబంధించినది అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

కొందరు మాత్రం నీకు అవసరమా ఏదో సినిమాలు వెబ్ సిరీస్ చేసుకోకుండా ఇలాంటివన్నీ నీకెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.

బాగా అనుభవం ఉన్న వారే కొత్త పార్టీ పెట్టలేకపోతున్నారు అలాంటిది నిన్న గాక మొన్న ఫేమస్ అయినా నీకెందుకు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

రెండేళ్లలో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజ్.. ఈ హీరో ప్లానింగ్ కు వావ్ అనాల్సిందే!