విశాఖ ఏజెన్సీ లో డేంజర్ బెల్స్… కొత్తరకం వైరస్!

విశాఖ ఏజెన్సీ లో డేంజర్ బెల్స్… కొత్తరకం వైరస్!

ఒకపక్క కరోనా వైరస్ తోనే గిలగిల్లాడుతున్న జనాలు ఇదే సమయంలో కొత్త కొత్త వైరస్ లు బయటపడుతుంటే ఠారెత్తి పోతున్నారు.

విశాఖ ఏజెన్సీ లో డేంజర్ బెల్స్… కొత్తరకం వైరస్!

దేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో విశాఖలో కొత్త రకం వైరస్ విజృంభిస్తుంది.

విశాఖ ఏజెన్సీ లో డేంజర్ బెల్స్… కొత్తరకం వైరస్!

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఈ కొత్త రకం వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది.

అయితే ఈ వైరస్ సోకినప్పుడు కూడా జ్వరం రావడం అనేది జరుగుతుంది.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్ రావడం తో ఇతర సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ,మలేరియా పరీక్షలు నిర్వహించారు.

అయితే అవి కూడా నెగిటివ్ రావడం తో అసలు ఈ సిమ‌్‌టమ్స్ దేని వల్ల వచ్చాయోనని పలువురు నిపుణులు అధ్యయనం చేయగా అప్పుడు బయటపడింది ఈ కొత్త రకం వైరస్.

ఇంతకీ ఈ వైరస్ పేరు ఏంటంటే స్క్రబ్ టైఫస్ అంట.అయితే కరోనా అంత డేంజర్ ఏమీ కాదు గానీ సరైన సమయంలో గుర్తించకపోతే మాత్రం కష్టమే అంటున్నారు నిపుణులు.

ఈ వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే యాంటీ బయోటిక్ ఇంజక్షన్‌తో నయం చేయవచ్చునని.ఆలస్యమైతే మాత్రం దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

అలానే కరోనా మాదిరిగా తీవ్రమైనది కాదని.ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని స్పష్టం చేస్తున్నారు.

ఒకపక్క కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ఇలాంటి కొత్త వైరస్‌ల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా స్వీయ రక్షణ, పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవడం వంటి చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

కెనడాలో గురుద్వారాపై రెచ్చగొట్టే రాతలు.. అనుమానితుల ఫోటోలు విడుదల