యువకుడిని చంపేసిన ప్రేమ జంట
TeluguStop.com
విశాఖ జిల్లాలో యువకుడి మృతదేహం కలకలం రేపింది.చనిపోయి చాల రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో భయంకరంగా తయారైంది.
ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.విశాఖ జిల్లా మల్కాపురంలోని హనుమాన్ గుడి ప్రాంతానికి చెందిన గుంటు స్వాతి(21), గాజువాకలోని గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన జోగారావు(27) ప్రేమించుకుంటున్నారు.
అయితే కొద్దికాలంగా అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేశ్(38) స్వాతిని వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో ప్రియుడు జోగారావుకి చెప్పుకుని బాధపడేది.దీంతో జోగారావు పలుమార్లు హెచ్చరించినా గణేష్ వినిపించుకోలేదు.
రోజురోజుకీ అతని వేధింపులు ఎక్కువకావడంతో ప్రేమజంట అతనిని అంతమొదించాలని నిర్ణయం తీసుకున్నారు.గణేష్ ను హత్య చేయడానికి ప్రేమ జంట ఒక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
అతనికి ఫోన్ చేసి ఒక్క ప్రాంతానికి రమ్మని చెప్పారు.అతనిపై ప్రేమజంట దారుణానికి పాల్పడ్డారు.
ఈ దాడిలో గణేష్ అక్కడికిక్కడే ప్రాణాలను కోల్పోయారు.వారు మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు.
రెండు రోజుల తర్వాత వారు మృతదేహన్ని కాలువలో పడేసి నిప్పు అట్టిచారు.శవం సగం కాలిపోయి కనపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి మృతుడి ఆచూకీ కనుగొన్నారు.హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.
ఓ ప్రేమజంట యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు.ప్రియురాలు కర్రతో తలపై కొట్టగా.
ప్రియుడు ఉరి వేసి చంపేసినట్లు వెల్లడైంది.ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మీనా వెల్లడించారు.
చందు మొండేటి స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…