ఆ దుర్ఘటనపై టాలీవుడ్ ప్రముఖుల స్పందన
TeluguStop.com
విశాఖపట్నంలోని ఆర్ వెంకటాపురంలో ఒక పరిశ్రమ నుండి విష వాయువు లీక్ అయ్యి చుట్టు పక్కల వారు మృతి చెందేందుకు కారణం అయ్యింది.
ఈ సంఘటనలో మొత్తం పది మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.
ఇక వందల సంఖ్యలో జనాలు ఊపిరి ఆడక తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సంఘటన జరిగిన పరిసర ప్రాంతాకు చెందిన జనాలు పెద్ద ఎత్తున అనారోగ్యం పాలయ్యారు.
ఈ సంఘటనపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.మహేష్‌బాబు ఈ విషయమై స్పందిస్తూ.
గ్యాస్ లీక్ దర్ఘుటన వార్త తెలిసి నా హృదయం ద్రవించింది.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను.
అనారోగ్యం పాలయిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
"""/"/
అల్లు అర్జున్ ట్విట్టర్‌లో.నా జీవితంలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది.
అలాంటి విశాఖను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం బాధగా ఉంది.ఈ భయంకర పరిస్థితి నన్ను కలచి వేసింది.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
"""/"/
ఎన్టీఆర్ ట్విట్టర్‌లో.వైజాగ్ గ్యాస్ లీకేజీ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది.
ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యమే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా..?