రోజు రోజుకు విశ్వవ్యాప్తమవుతున్న విశాఖ కీర్తి…
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం( Visakhapatnam ) ను ఏర్పాటు చేసుకునేలా, పూర్తి స్థాయిలో శాశ్వత రాజధానిగా మార్చేందుకు సీఎం జగన్ ఈ విషయానికి దోహద పడేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు.
అందులో భాగంగానే మన దేశం లో 50 నగరాలలో G20 సన్నాహక సదస్సులు జరగాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నగరాన్ని ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది.
ఐతే ఇటువంటి నిర్ణయం ఇది మొదటి సారి కాదు.ఇప్పటికే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్( Global Investors Summit ) సహా ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం జగన్( CM Jagan ) విశాఖ పై ఈ రకమైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు.
అందమైన సముద్ర తీర ప్రాంతం ,ఆహ్లాద వాతావరణం, అటు ప్రకృతి అందాలు ఇటు అభివృద్ది చెందిన నగర నిర్మాణం లాంటి అంశాలు ఇటువంటి నిర్ణయానికి బలం చేకూరుస్తున్నాయి.
విదేశాల నుండి మరియు మన దేశ నలుమూలల నుండి వస్తున్న ప్రముఖులను ఆకర్షించి ఆకట్టుకునే సామర్ధ్యం విశాఖ నగరానికి పూర్తి స్థాయిలో ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టు గా తెలుస్తోంది.
ఈ విధం గా అంతర్జాతీయ చిత్రపటం లో విశాఖ ను నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి కొంత వరకు నెరవేరింది అనే చెప్పాలి.
"""/" /
ఐతే అంతా బాగానే ఉంది కానీ సీఎం జగన్ విశాఖకు తన మకాం మారుస్తాను అన్న విషయం మాత్రం ఎప్పటికప్పుడు వెనుక పడుతూనే ఉంది.
ఆయన మాటల ప్రకారం ఈ ఉగాది కే విశాఖ లో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుండే పరిపాలన అందించాల్సి ఉన్నా వివిధ కారణాల వలన అది సాధ్యపడలేదు అని చెప్పుకొస్తున్నారు.
రాబోయే జూన్ కు ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది.అయితే అప్పటికి ఉండే పరిస్థితులు ,రాజకీయ కారణాలు ,న్యాయపరమైన ఇబ్బందులు ఏవి ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చెప్పలేం.
మొత్తానికి " విశాఖ కేంద్రం గా రాష్ట్ర పరిపాలన " అన్న అంశం నిజరూపం దాల్చడానికి మరికొద్ది కాలం వేచి చూడాలి.
"""/" /
మొత్తానికి హైదరాబాద్ స్థాయి నగరంగా విశాఖ నగరం రూపుదిద్దుకుంటే ఆర్థికంగా బాసటగా నడుస్తుందని అంచనాలు ఉండగా రాజకీయ కేంద్రంగా ఈ అంశం మారడం మాత్రం కొంత విషాదమనే చెప్పాలి
.
గేమ్ ఛేంజర్ మూవీకి ఆ రెండు సీన్స్ హైలెట్ కానున్నాయా.. ఫ్యాన్స్ కు పూనకాలే!