వామ్మో… 5 మీటర్లు పొడవున్న వెంట్రుకలు…! అసలు సంగతేంటంటే…!?
TeluguStop.com
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ నాలుగు నెలల టైం పీరియడ్ లో చాలా మంది పురుషులు హెయిర్ కటింగ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
సెలబ్రిటీల భార్యలు తమ భర్తలకు, పిల్లలకు జట్టు కత్తిరించి సోషల్ మీడియాలో పెట్టడం చూశాం.
సెలూన్లు మూతబడటంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి.అన్ లాక్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి నిబంధనలకు అనుగుణంగా హెయిల్ కట్ చేసుకోవడం చూస్తునే ఉన్నాం.
నాలుగు నెలలు గడ్డం, హెయిర్ చేసుకోకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.కానీ వియత్నాంకు చెందిన 92 ఏళ్ల న్గుయెన్ వాన్ చియెన్ గత 82 సంవత్సరాలుగా తన జుట్టును కత్తిరించుకోలేదు.
ఇన్ని సంవత్సరాల నుంచి జుట్టును కత్తిరించుకోకుండా అలానే పెంచుతూ వస్తున్నారు.అయితే ఈ జుట్టు కత్తిరించకపోవడానికి ఓ కారణం ఉంది లేండీ.
జుట్టును కత్తిరిస్తే తన ప్రాణాలు పోతాయని, జుట్టులోనే తన ప్రాణం దాగి ఉన్నట్లు న్గుయెన్ వాన్ చియెన్ భావిస్తాడట.
అందుకే ఇన్ని సంవత్సరాలైనా తన జుట్టును కత్తిరించుకోలేదు.82 ఏళ్లుగా పెంచుకుంటున్న జుట్టు 5 మీటర్ల మేర పెరిగింది.
న్గుయెన్ వాన్ చియెన్ మూడవ తరగతి చదివే వరకు జట్టును కత్తిరించుకునే వాడట.
ఆ తర్వాత ఇంకెప్పుడు హెయిర్ కట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.అప్పటి నుంచి తలస్నానం చేయడం కానీ, జుట్టును దువ్వడం గానీ మరిచాడు.
పెరిగిన జుట్టును అలాగే ముడి వేసి ఆరెంజ్ కలర్ తలపాగా చుట్టి తలపై ఆరెంజ్ కలర్ బట్టతో కవర్ చేస్తున్నాడు.
చిన్నప్పటి నుంచి హెయిర్ నల్లగా, మందంగా, బలంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు.చిన్నప్పటి నుంచి ఎక్కువగా కొబ్బరికాయలు తిని బతుకుతున్నానని ఆయన పేర్కొన్నాడు.
హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!