జగన్ డిల్లీ టూర్.. అవినాష్ రెడ్డిని తప్పించేందుకే !

ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy )హత్య కేసు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తోంది.

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy ) ప్రధాన నిందితులనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే అవినాష్ రెడ్డిని ఇప్పటికే తెలంగాణ సీబీఐ నాలుగు సార్లు విచారించింది.

భాస్కర్ రెడ్డిని కూడా రెండు సార్లు విచారించింది.దీంతో వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి.

అయితే అనూహ్యంగా సీబీఐ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని, అరెస్ట్ చేయకుండా తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. """/" / అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

అయితే హైకోర్టు నుంచి ఇలా తీర్పు వచ్చిందో లేదో వెంటనే ఏపీ సి‌ఎం జగన్ డిల్లీకి పయనం అవ్వడం పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తావోస్తోంది.

ఒకవైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికి హటాత్తుగా సి‌ఎం జగన్ డిల్లీకి పయనం అవ్వడం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ తోలుస్తోంది.

అయితే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి( Avinash Reddy ) ఏక్షణమైన అరెస్ట్ కావొచ్చనే అంచనకు వచ్చిన తరువాతే జగన్ డిల్లీ పయనం అయ్యారనేది టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట.

అయితే ప్రధానితో తాజాగా జగన్ భేటీ ముగిసింది.భేటీలో రాష్ట్రనికి రావలసిన నిధుల విషయమై చర్చించినట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

"""/" / కానీ అసలు విషయం వేరే అనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట.

అవినాష్ రెడ్డి అరెస్టు ను తప్పించేందుకే ప్రధాని మోడి( Prime Minister Modi )తో జగన్ భేటీ అయ్యారని టీడీపీ సెటైర్లు కురిపిస్తోంది.

ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అది జగన్ తలకు చుట్టుకునే అవకాశం ఉంది.

ఎందుకంటే మొదటినుంచి కూడా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు సి‌ఎం జగన్.

కేసు విచారణలో కూడా జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసింది వివేకా కూతురు సునీత రెడ్డి.

ఒక విధంగా వివేకా హత్య జగన్ ఆదేశంతోనే జరిగిందని టీడీపీ మొదటినుంచి కూడా ఆరోపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో వివేకా హత్యలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ జగన్ కు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం వైఎస్ జగన్ డిల్లీ టూర్ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు కారణం అవుతోంది.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players