వివేకా హత్య కేసు : వైఎస్ భాస్కర రెడ్డి అరెస్ట్
TeluguStop.com
అప్పట్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( Former Minister YS Vivekananda Reddy )హత్య కేసు వ్యవహారం ఇప్పటికే సంచలనంగానే మారింది.
మొదట్లో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం జరిగినా, ఆయన హత్యకు గురైనట్లుగా అనేక ఆధారాలు లభించడంతో, అప్పట్లోనే దీనిపై పెద్ద దుమారం రేపింది.
చివరకు ఈ వ్యవహారంను తేల్చేందుకు కోర్టు ఈ కేసును సీబీఐ( CBI )కు అప్పగించింది.
ముఖ్యంగా ఈ హత్య వ్యవహారంలో వైఎస్ కుటుంబీకులే ఉన్నట్లుగా సిబిఐ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే వచ్చింది.
ఇప్పటికే వివేకా హత్య కేసులో సంబంధం ఉన్నట్లుగా భావించి కొంతమందిని అరెస్టు చేశారు.
తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) తండ్రి భాస్కర్ రెడ్డిని( Bhaskar Reddy ) ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
"""/" /
ఈరోజు తెల్లవారుజామున పులివెందులకు చేరుకున్న సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు.
పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలించారు.ఈ సందర్భంగా సిబిఐ అధికారుల వాహనాలను అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
భాస్కర్ రెడ్డి పై సెక్షన్ 130బి, రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య, వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారాన్ని అధికారులు ఇచ్చి హైదరాబాద్ కు తరలించారు.
ఆయనను హైదరాబాదులోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.మొదటి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పైన సిబిఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూనే వచ్చారు.
ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. """/" /
అలాగే రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయకుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు కడపలో అరెస్టు చేశారు.
వివేకానంద రెడ్డి హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ అధికారులు గుర్తించారు.
సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయం అదుపులోకి తీసుకున్నారు.ఇప్పుడు భాస్కర్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగాను సంచలనంగా మారింది.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం , జనసేన , బీజేపీలు ఈ హత్య వ్యవహారంపై జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నాయి.
ఇప్పుడు జగన్ చిన్నాన్న భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగాను సంచలనగా మారింది.
భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక.. అలా చెప్పడంతో?