విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

మన శరీరానికి విటమిన్ E ఎంతో అవసరం.ఈ విటమిన్ మన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ఈ విటమిన్ లోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.విటమిన్ E శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జీవక్రియ సరిగ్గా  జరిగేలా చేస్తుంది.

అంతేకాక ఎనిమిది రకాల వ్యర్ధాలను బయటకు పంపటంలో కీలక పాత్రను పోషిస్తుంది.ఇది కణాల చర్మాన్ని రక్షించటం ద్వారా చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలు, ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే చర్మ ఆరోగ్యంలో కూడా కీలకంగా ఉంటుంది.విటమిన్ E రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

అనేక చర్మ సమస్యలను సమర్ధ వంతంగా పరిష్కారం చేయటం వలన అనేక చర్మ రక్షణ క్రీమ్స్ లో వాడుతున్నారు.

విటమిన్ E కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది.రోగనిరోధక శక్తిని బలపరచి క్యాన్సర్ కారకాలు పెరగకుండా చూడటమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది.

కళ్ళ మంటలు ,కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటి వాటికి విటమిన్ E సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

మధుమేహం ఉన్నవారికి విటమిన్ E చాలా బాగా సహాయ పడుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

విటమిన్ E పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులో మామిడిపండు, కమలాపండు వంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.విటమిన్ E కాప్సిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

కానీ విటమిన్ E ని సహజసిద్ధంగా తీసుకుంటేనే మంచిది.

కాంగ్రెస్ లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!