`విటమిన్ సి` ఇమ్యూనిటీ పెంచడమే కాదు.. ఆ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది!!
TeluguStop.com
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.ఈ ప్రాణాంతక వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ లేకపోవడంతో.
ప్రపంచదేశాల ప్రజలకు కరోనా చుక్కలు చూపిస్తోంది.అయితే ఈ కరోనా నుంచి రక్షించుకోవాలంటే.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం.ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సి ఉన్న ఫుడ్‌ను తీసుకుంటున్నారు.
తాజా పండ్లు, కాయగూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.అందుకే క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉంటే.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే విటమిన్ సి కేవలం ఇమ్యూనిటీ పెంచడమే కాదు.
మరెన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.వాస్తవానికి విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు.
అందుకే పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్ సి ని మనమే శరీరానికి అందేలా చూసుకోవాలి.
ఇక విటమిన్ సి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.ప్రాణాంతక కాన్సర్ వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది.
ముఖ్యంగా చర్మం, గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించడంలో విటమిన్ సి అద్భుతంగా సహాపడుతుంది.
అలాగే శరీర బరువును క్రమబద్ధీకరించడంలోనూ విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తోంది.ఎముకలు దృఢంగా ఉండాలన్నా, చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా విటమిన్ సి చాలా అవసరం.
అలాగే శరీరంలోని అన్నిరకాల కణాజాలాలను వృద్ధి చేస్తుంది చేస్తుంది.నష్టపోయిన కణజాలాన్ని నమం చేస్తుంది.
మరి రోజుకు విటమిన్ సి ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే.మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాల్సి ఉండగా.
ఆడవాళ్లు రోజూ 75 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024