Vittalacharya : ఎవరు ఏం అన్నా ఆయన తెలుగు సినిమాలు బడ్జెట్ పాఠాలు నేర్పిన ఒక గురువు

సినిమా అంటే ఖచ్చితంగా వినోదాత్మకమే.కళ మాత్రమే ఉంటే అది వ్యాపారంగా ఎప్పుడు మారుతుందో తెలీదు.

ఎందుకంటే కళ, వ్యాపారం రెండు ఒకే నానానికి ఉన్న భూమ బొరుసు లాంటివి.

మరి కేవలం వినోదంతో కూడిన విజ్ఞానం మాత్రమే ఇస్తే దానికి ఆర్థిక పరిస్థితులు ఎలా సహకరిస్తాయి చెప్పండి.

అందుకే వినోదాన్ని అందించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు అంటే బడ్జెట్ అనేది ఖచ్చితంగా కావాలి.

మరి బడ్జెట్ పెట్టాలి అంటే దాన్ని ఎకానమీలో తీయగలగాలి.ఎక్కువ హడావిడి చేయకుండా డబ్బులు వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి ఎక్కువ లాభాలు పొందాలి.

ఈ సూత్రాన్ని మొట్టమొదటగా సౌత్ ఇండియాలోనే ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒంట పట్టించుకున్నది విఠలాచార్య.

"""/" / అప్పట్లో అనేక సీన్స్ ని రకరకాల సీట్లలో తీయకుండా అన్ని ఒకే సేటు మీదకు తీసేలా ప్లాన్ చేసి ఈ సక్సెస్ అయ్యాడు ఈ ఫార్ములా ఇప్పుడు టీవీ సీరియల్స్( TV Serials ) కి వాడుతున్నారు కానీ సినిమాల్లో మొట్టమొదటగా ఈ తరహా ప్రయోగాలు చేసింది ఆయనే.

ఫ్యామిలీ చిత్రాలు తీయాలి దానికి డబ్బు తక్కువ ఖర్చు అవుతుంది అని నమ్మేవాడు అలాగే ఎక్కువ డబ్బులు పెట్టి లాభాలు పొందాలంటే అది కుదిరే పని కాదు.

తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని పాఠాలు చెప్పేవాడు.చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టికెట్టు ధర ఒకటే అయినప్పుడు డబ్బు మాత్రం ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆయన ఎదురు ప్రశ్నించేవారు.

తక్కువ బడ్జెట్ లో డ్యూయెట్స్ చేయించి టెక్నాలజీని వాడకుండా, సాంకేతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా చక్కటి సినిమాలు తీసి ఎక్కువ ప్రయోజనాలు పొందేవారు.

"""/" / ఇప్పుడు ఈ తరహా ప్రశ్నలు వర్మ అడుగుతున్న ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదు.

చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ సినిమాలు ఒకవేళ పరాజయం పాలైనా కూడా నిర్మాత మునిగిపోయే అవకాశం ఉండదు.

మరి అంత డబ్బు తక్కువ పెట్టి తీసిన సినిమాలకు కూడా విఠలాచార్య( Vittalacharya ) అని పేరు పెడితే చాలు మంచి డిమాండ్ ఉండేది.

మలేషియాలో, ఆఫ్రికా దేశాల్లో విఠలాచార్య జానపద చిత్రాలకు బాగా డిమాండ్ ఉండేది.అక్కడ భాషల్లో వాటిని డబ్ చేసేవారు.

తమిళ ఇండస్ట్రీ( Kollywood )కి అప్పట్లో అనేక రూపాల్లో డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తి కూడా విఠలాచార్య అని ఒప్పుకోవాల్సిందే.

పైగా 1963 ప్రాంతంలో సౌత్ ఇండియాలోనే అందరికన్నా ఎక్కువగా డబ్బులు రెమ్యునరేషన్ గా తీసుకున్న వ్యక్తిగా విఠలాచార్య రికార్డును సృష్టించారు.