తన బయోపిక్‌ పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన విశ్వనాథన్ ఆనంద్..!

ప్రస్తుత భారత సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ తీసే పనిలో నిమగ్నం అయిపోయారు.ఈ క్రమంలోనే ప్రముఖ క్రీడాకారుల బయోపిక్‌ లు తీసి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఒక సామాన్య వ్యక్తి గొప్ప ఆటగాడు అయ్యాడంటే అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కునే ఉంటాడు.

అలాంటి ఆటగాళ్ల జీవిత చరిత్రలను కళ్లకు కట్టినట్టు ప్రేక్షకులకు చూపించి వాళ్ళ మనసులను దోచేస్తున్నారు దర్శకులు.

బయోపిక్‌ లకు ప్రజలలో విశేష ఆదరణ లభిస్తుండడంతో ఇప్పుడు మరొక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు.

అతను మరెవరో కాదు వరసగా ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్.

ఇప్పుడు ఆయన బయోపిక్‌ చేయడానికి సిద్ధపడ్డారు.ఈ క్రమంలోనే కోల్‌కతాకు వచ్చిన విశ్వనాథన్ ఆనంద్ తన బయోపిక్‌ పై ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరి ఆయన జీవితం గురించి చెప్పిన విశేషాలేంటో చూద్దామా.లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో విశ్వనాథన్ ఆనంద్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

"నేను నా బయోపిక్‌ కి అంగీకరించాను.ఈ విషయం ఇప్పటికే నిర్మాతతో చాలాసార్లు చర్చించాను కూడా.

అలాగే వారికి నా జీవిత విశేషాలు చెప్పడం జరిగింది.అలాగే స్క్రిప్ట్ రైటింగ్ పనులు కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయి.

ఈ బయోపిక్ గురించి తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడండి'' అని తెలిపారు.

"""/"/ మీ బయోపిక్ ను ఏ దర్శకుడు తీస్తున్నారని ఆనంద్‌ ను ప్రశ్నించగా ప్రస్తుతం సినిమా పనులు మాత్రమే జరుగుతున్నాయని నేను చెప్పగలను కానీ అంతకు మించి ఏమి చెప్పను అని తెలిపారు.

ఈ సినిమాలో తన పాత్రలో ఏ నటుడిని చూడాలనుకుంటున్నారని ఆనంద్‌ ను ప్రశ్నించగా దానికి సమాధానంగా సినిమాలో నా పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ తెరపై నటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానని చెప్పారు.

ఆమిర్‌ ఖాన్‌ మనస్తత్వం, అతని నమ్మకాలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయని నేను భావిస్తున్నాను" అని ఆనంద్ చెప్పుకొచ్చారు.

మీరు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు.రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు.

నేను చదరంగం ఆడాలనుకుంటున్నాను" అని సమాధానమిచ్చారు.అలాగే రిటైర్‌మెంట్ గురించి అడగగా నాకు చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం అని, ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన అనేది లేదని తెలిపారు.

ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!