థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

2024లో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavar ) చిత్రాలతో మంచి హిట్లు అందుకున్న విశ్వక్ సేన్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. """/" / ఇటీవల విడుదల అయిన గామిలో అఘోర రోల్ లో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న విశ్వక్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లంకల రత్నగా అలరించారు.

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్ సేన్ తన యాక్షన్, డైలాగుల డెలివరీతో ప్రేక్షకులను మెప్పించారు.

రూరల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ దక్కించుకుని సాలిడ్ వసూళ్లు రాబట్టింది.

గోదావరి జిల్లాల బ్యాక్‍ డ్రాప్‍ లో లోకల్ పాలిటిక్స్‌ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది.

"""/" / కాగా హీరో విశ్వక్ కెరీర్ లో గామి తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది.ఓటీటీ లవర్స్ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

విశ్వక్ యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు.మాస్ కా దాస్ ట్యాగ్ కు విశ్వక్ సేన్ ఈ సినిమాలో సరైన న్యాయం చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన బీచ్.. ఎక్కడుందంటే..