భర్త మృతితో అవమానాలు.. రూ.1000 కోసం వంటపని.. పిల్లలను ప్రయోజకులను చేసిన ఈ తల్లికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావిస్తారు.అయితే కొన్నిసార్లు జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
మారుమూల గిరిజన గ్రామంలో జన్మించిన విస్తార బాయి( Vistara Bai ) వేర్వేరు కారణాల వల్ల చదువుకోలేదు.
పెళ్లి తర్వాత విస్తార బాయి ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు భర్త మరణంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
విస్తారా బాయి మాట్లాడుతూ భర్త చనిపోయే సమయానికి నా వయస్సు 21 సంవత్సరాలు అని తెలిపారు.
బిడ్డలను ఎలా సాకాలో తెలియక నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె అన్నారు.అన్నయ్య సాయంతో చిన్న గుడిసె వేసుకుని పాచిపనులు చేస్తూ పిల్లల కడుపు నింపానని ఆమె తెలిపారు.
ఆ తర్వాత స్థానిక పాఠశాలలో వంట చేసే అవకాశం దక్కిందని విస్తారా బాయి చెప్పుకొచ్చారు.
"""/" /
నెలకు 1000 రూపాయల జీతం ఇచ్చి అన్నం పెడతామని చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని విస్తారా బాయి కామెంట్లు చేశారు.
ఒంటరి మహిళగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని వితంతు మహిళనంటూ( Widow ) హేళన చేశారని ఆమె తెలిపారు.
అయితే ముగ్గురు పిల్లలను ఎంతో కష్టపడి ఆమె చదివించారు.విస్తారా బాయి పెద్ద కొడుకు రేవయ్య( Revaiah ) ఐఐటీ మద్రాస్ కు ఎంపికై దాతల సహాయంతో చదివారు.
"""/" /
కూతురు స్వప్న( Swapna ) ఐఐటీ నాగ్ పూర్ కు ఎంపికై అక్కడే కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
మరో కొడుకు ప్రస్తుతం తిర్యాణీ అనే ప్రాంతంలో పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.
పెద్ద కొడుకు రేవయ్య ప్రస్తుతం ఓ.ఎన్.
జీ.సీలో 2 లక్షల రూపాయల వేతనానికి పని చేస్తున్నారు.
విస్తారా బాయి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఆమె ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం.. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఇతడే..