పెన్నా టు వంశధార పేరుతో టీడీపీ ప్రాజెక్టుల సందర్శన
TeluguStop.com
ఏపీలోని ప్రాజెక్టులను సందర్శించేందుకు టీడీపీ సమాయత్తం అయిందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ మేరకు పెన్నా టు వంశధార పేరుతో ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు.ఈ క్రమంలోనే ఆగస్ట్ 1వ తేదీ నుంచి సుమారు పది రోజులపాటు చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శిస్తారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేసిన విధానాన్ని చంద్రబాబు వివరిస్తారని తెలిపారు.కాగా పెన్నా టు వంశధార అనేది ప్రజా అవగాహన కార్యక్రమమని స్పష్టం చేశారు.
జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను వైసీపీ సర్కార్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు.