Vishwak Sen: ఎన్టీఆర్ నాకు ఆ మెసేజ్ పెట్టగానే కన్నీళ్లు పెట్టుకున్నాను.. హీరో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ.
( Das Ka Dhamki ) ఈ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్( Niveda Pethuraj ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విశ్వక్ సేన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే విడుదల తేదీకి మరి కొన్ని రోజులే సమయం ఉండడంతో తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకున్న శిల్పకళా వేదికలో నిర్వహించారు.
ఈ వేడుకకు యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కాగా హీరో విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ కీ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ఈ వేదికపై మాట్లాడుతూ.నమస్కారం ఇది నా వాయిస్ కాదు.
నందమూరి తారక రామారావు ప్రతి ఫ్యాన్ వాయిస్ ఇది.ఎందుకంటే ఈరోజు ఆయన చేసింది నా ఒక్కడి కోసం కాదు.
ఆయన అభిమాని కోసం ఇచ్చిన మాట కోసం, నిద్ర లేకపోయినా ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడి వరకు వచ్చారు.
"""/" /
మీరు నమ్మరు నన్ను 2 నెలల క్రితం అన్న ఇంటికి పిలిచి మరి తమ్ముడికి భోజనం పెట్టినట్లు పెట్టారు.
తర్వాత కారు వరకు వచ్చి నన్ను ఎక్కించేటప్పుడు నేను అడిగాను.అన్న ధమ్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే బాగుంటుంది అని అడగగా వెంటనే నీకు మాట ఇచ్చాను నువ్వు వెళ్ళు అన్నారు.
కానీ ఇంతలో ఊహించని విధంగా ఆయన ఇంట్లో విషాదం జరిగింది.దాంతో నేను ఆయనకు ఏం గుర్తు చేయాలి సైలెంట్ గా ఉండిపోతే బాగుండు అని మౌనంగా ఉన్నాను.
కానీ అన్నకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాడి ప్రోగ్రాం ఎప్పుడో కనుక్కో అని నాకు కబురు పంపాడు.
"""/" /
అప్పుడు ఆఫ్టర్ కాదు అసలు ఆయనకు ఆస్కార్ నథింగ్.ఆరోజు అనుకున్న మాట మీద నిలబడే వ్యక్తి ఆయన అని.
అరేయ్ నేను రావడం ఒక బాధ్యత రా అని ఆయన నాకు మెసేజ్ చేసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని చెప్పుకొచ్చారు విశ్వక్ సేన్.
థాంక్యూ అన్న దేశం మొత్తం గర్వపడేలా చేశావు.నేను ఎప్పుడో చెప్పాను.
ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే నా ఎన్టీఆర్ అని చెప్పా.ఇక ఆ మాస్ కాదు ఈ మాస్ కాదు.
నా మాస్ అమ్మ మొగుడు.17 ఏళ్లకే తొడగొట్టి బాంబులు వేసిన ఆయన నాకు తెలిసి మళ్ళీ హిస్టరీ లోనే రిపీట్ కాదు అంటూ తారక్ పై పొగడ్తల వర్షం కురిపించారు విశ్వక్ సేన్.