Vishwak Sen : ఆ రెండు సినిమాలకు సీక్వెల్ తీస్తాను.. విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లలో విశ్వక్ సేన్ పేరు కూడా ఒకటి.

హీరో విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే హైలెట్ అవడంతో పాటు ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నారని చెప్పవచ్చు.

అయితే కాంట్రవర్సీలు నిలుస్తున్నప్పటికీ ఈ యంగ్ హీరోకి అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు.

ఒకదానికి తర్వాత ఒకటి సినిమాలో వరుసగా విడుదల చేస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నాడు.

"""/" / ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా దాస్ కా దమ్కీ( Das Ka Damki ).

ఉగాది పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ సేన్ ఆనందంలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల గురించి అనేక విషయాల గురించి పంచుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.సినిమా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.

"""/" / కాళ్లు నిలవడం లేదు అంటారు కదా అలా ఉన్నాను.దానికంటే మంచి ఫలితం దక్కింది అని తెలిపారు విశ్వక్ సేన్.

సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం ఎలా అనిపించింది అని అడగగా.మొదట చేయగలనా లేదా అనిపించింది.

కానీ సినిమాకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషం వేసింది.ఆ పాత్రకు నేను న్యాయం చేయగలిగాను అనుకుంటున్నాను అని తెలిపారు.

త్వరలోనే మీ దర్శకత్వంలో మరో సినిమా ఆశించవచ్చా అని యాంకర్ అడగగా.ఆ విషయం పై స్పందించిన విశ్వక్ సేన్.

లేదు.చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

ఇప్పటికే ఆ నిర్మాతలు నా కోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నారు.మరో నాలుగు సినిమాల తర్వాత అప్పుడు దర్శకత్వం వహిస్తాను.

దాస్ కా ధమ్కీ 2, ఫలక్ నుమా దాస్ 2 రెండు సినిమాలకు సీక్వెల్ తీయాలి.

అయితే అందులో ఏది ముందు వస్తుందో చెప్పలేను అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

వైరల్ వీడియో : రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కారును కాలుతో తంతూ..!