మా లవ్ బ్రేకప్ అయింది.. వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.

మరికొన్ని గంటల్లో లైలా సినిమాతో( Laila Movie ) విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.

లైలా సినిమా పలు వివాదాల్లో చిక్కుకోగా ఆ వివాదాలకు సంబంధించి విశ్వక్ సేన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పడం గమనార్హం.

2 గంటల 16 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కగా పాజిటివ్ టాక్ వస్తే బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.

అయితే విశ్వక్ సేన్ లైలా ప్రమోషన్స్ లో భాగంగా తన బ్రేకప్ స్టోరీ గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

టీనేజ్ లో ఉన్న సమయంలో ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం పుడుతుందని విశ్వక్ సేన్ అన్నారు.

ఆ సమయంలో దానిని మనం సీరియస్ రిలేషన్ అని అనుకుంటామని ఆయన కామెంట్లు చేశారు.

"""/" / ఆ రిలేషన్ గురించి ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తుందని విశ్వక్ సేన్ తెలిపారు.

అలాంటిదే నా లైఫ్ లో కూడా ఉందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.అలాంటిదే నా లైఫ్ లో కూడా ఒక కథ ఉందని అది కాకుండా సీరియస్ లవ్ స్టోరీ( Love Story ) కూడా ఉందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

24 సంవత్సరాల వయస్సులో ప్రేమలో పడ్డానని మూడున్నరేళ్లకు బ్రేకప్( Breakup ) అయిందని విశ్వక్ సేన్ వెల్లడించారు.

"""/" / ఆ సమయంలో నేను ఎంతో బాధ పడ్డానని ఆ బాధ నుంచి బయటకు వచ్చి లైఫ్ పై ఫోకస్ పెట్టానని విశ్వక్ సేన్ తెలిపారు.

ఆ తర్వాత నాకు ఎవరిపై ఇష్టం కలగలేదని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

27 సంవత్సరాల వయస్సులో కూడా బాధతో కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.