విశ్వక్ సేన్ కు గతంలో నో చెప్పి ఇప్పుడు యాక్ట్ చేసిన ప్రముఖ నటి ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌( Young Hero Vishwak Sen ) గురించి మనందరికీ తెలిసిందే.

విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అంతేకాకుండా విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న సినిమాలన్నీ మంచి హిట్లు సాధిస్తున్నాయి.ఇకపోతే విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాఖి.

( Mechanic Rakhi ) ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

మీనాక్షి చౌదరి,శ్రద్ధ శ్రీనాథ్ ( Meenakshi Chaudhary, Shraddha Srinath )లు ఇందులో హీరోయిన్ నటిస్తున్నారు.

"""/" / ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

రవితేజ చెప్పిన కథ తనకెంతో నచ్చిందని అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.బిట్స్ పిలానీ కాలేజీతో ( BITS Pilani College )నాకెంతో మంచి అనుబంధం ఉంది.

ఇక్కడ జరిగిన ఒక పోటీలో నేను పాల్గొని అవార్డు అందుకున్నాను.ఆ తర్వాత దర్శకత్వంపై మనసు మళ్లింది.

ఫలక్‌నుమా దాస్‌ తెరకెక్కించాను.మంచి విజయాన్ని అందుకున్నాను.

"""/" / మెకానిక్‌ రాకీ సినిమాలో నా రోల్‌ ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది.

లోకల్‌ బాయ్‌గా కనిపిస్తాను.ఇందులో హీరోయిన్‌ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ గురించి ఒక విషయాన్ని చెప్పాలి.

ఫలక్‌నుమా దాస్‌ మూవీ కోసం మొదట ఆమెనే తీసుకోవాలని అనుకున్నాము.ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు వెళ్లగా, కలిసి కథ కూడా చెప్పాము.

కాకపోతే ఆమె నో చెప్పింది.చేతులో డబ్బుల్లేనప్పటికీ ఖర్చు పెట్టుకొని బెంగళూరుకు వెళ్లి అనుకున్న పని జరగకపోవడంతో కాస్త బాధపడ్డాను.

ఇప్పుడు ఆమె నా సినిమాలో యాక్ట్‌ చేస్తుంటే ఆనందంగా ఉంది అని విశ్వక్‌సేన్‌ తెలిపారు.

ఇకపోతే యాక్షన్ కామెడీ ఫిలిం గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?