థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీ రిజల్ట్ ఏంటో.. లైలా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి మనందరికీ తెలిసిందే.విశ్వక్ సేన్(vishwak Sen) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు విశ్వక్ సేన్.

ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లైలా(Laila).

గత నెల వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

విడుదల అయినా మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాప్ తెచ్చుకోవడంతో అభిమానులు భారీగా నిరాశ చెందారు.

థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో(OTT) ప్రేక్షకులను అంలరించడానికి సిద్ధమవుతోంది.

ఈ మేరకు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన కూడా చేశారు.ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మూడు వారాల్లో తిరిగేసరికి మార్చి 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సినిమా.ఈమెకు అఫీషియల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

"""/" / ఇకపోతే థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

కాగా లైలా సినిమాలో విశ్వక్ సేన్ సోను మోడల్ అనే ఒక కుర్రాడి పాత్రలో అమ్మాయి గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే.

అయితే లేడీ గెటప్స్ లో చెప్పిన డైలాగ్స్ కాస్త డబ్బులు మీనింగ్ తో ఉండడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

దాంతో ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను అంటూ విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా తెలిపారు.