విశ్వక్ సేన్ ఆవేదనలో న్యాయముంది.. నాని, నితిన్, వరుణ్ ఈ కామెంట్లపై స్పందిస్తారా?
TeluguStop.com
బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో విశ్వక్ సేన్( Vishwaksen ) ఒకరు.
సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకునే ఈ హీరో పలు సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.
తాజాగా విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తూ విశ్వక్ సేన్ ఈ పోస్ట్ చేయగా ఈ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
విశ్వక్ సేన్ తన పోస్ట్ లో మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దామని చూస్తాడని అన్నారు.
"""/" / గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs Of Godavari ) డిసెంబర్ 8వ తేదీన కాకుండా మరో తేదీన రిలీజ్ కావాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో నన్ను చూడరని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.
డిసెంబర్ లో మొదటి వారంలో నాని, నితిన్, వరుణ్ తేజ్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఈ హీరోలు విశ్వక్ సేన్ కామెంట్ల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.ఈ సినిమాల వల్ల తన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది.
"""/" /
ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడం వల్ల అన్ని సినిమాలు నష్టపోయే అవకాశం ఉంది.
సలార్ మూవీ( Salaar ) రిలీజ్ డేట్ మార్పు వల్ల ఎన్నో సినిమాల రిలీజ్ డేట్లకు ఇబ్బంది కలిగింది.
తన సినిమాల రిలీజ్ సమయంలో ప్రతి సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ ఒకింత ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను సితార నిర్మాతలు నిర్మించగా ఈ సినిమా రిలీజ్( Movie Release Dates ) విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
శంకర్ చేసిన మిస్టేక్స్ వల్లే గేమ్ చేంజర్ రిజల్ట్ ఇలా వచ్చిందా..?