జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

విశ్వక్ సేన్( Vishwaksen ) హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.

ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండగా వరుసగా విజయాలు సాధిస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) వీరాభిమాని అయిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

జునియర్ ఎన్టీఆర్ ను చూస్తే తారక్ తనకు ఇండియాలోనే గొప్ప నటుడు అని అనిపిస్తాడని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ లా యాక్టింగ్ చేయడానికి తాను ఎంతగానో కృషి చేస్తానని విశ్వక్ సేన్ వెల్లడించారు.

ఇదే ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ సైతం జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

"""/" / యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా గట్టిగా తొడ కొడతారని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అంత గట్టిగా మళ్లీ విశ్వక్ సేన్ తొడ కొట్టగలుగుతాడని నాగవంశీ( Naga Vamshi ) వెల్లడించారు.

సినిమాలో విశ్వక్ సేన్ తొడ కొట్టడాన్ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు.

మే నెల 17వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

"""/" / విశ్వక్ సేన్ మాస్ రోల్ లో కనిపించనుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

కృష్ణచైతన్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.గామి సినిమాతో హిట్ సాధించిన విశ్వక్ సేన్ తర్వాత సినిమాలతో సైతం భారీ హిట్లను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పండ్ల తొక్కలతో మరింత అందంగా మెరిసిపోండిలా..!