ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పిన విశ్వక్ సేన్.. నా తప్పు లేదంటూ?

గత రెండు రోజులుగా విశ్వక్ సేన్ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

అర్జున్ డైరెక్షన్ లో నటించాల్సిన ఒక సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకోవడంపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ వివాదం గురించి విశ్వక్ సేన్ పూర్తిస్థాయిలో స్పందించి స్పష్టత ఇచ్చారు.

నేను ఏ సినిమా చేసినా నా సినిమా అనుకుని చేశానని విశ్వక్ సేన్ అన్నారు.

నేను పక్కా ప్రొఫెషనల్ అని ఆయన కామెంట్లు చేశారు.నా వల్ల ఏ నిర్మాత కూడా డబ్బులు పోగొట్టుకోలేదని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

రాజయోగం మూవీ టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ మా మధ్య సరైన అవగాహన లేదని నేను సినిమా చెయ్యనని చెప్పలేదని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

వాళ్ల మేనేజర్ రెమ్యునరేషన్ వెనక్కి పంపించాలని కోరారని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

సెట్ లో కంఫర్ట్ లేకుండా నేను సినిమా చేయలేనని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

నేను ఏం చేసినా సినిమా మంచి రిజల్ట్ అందుకోవాలనే ఆలోచనతో మాతమ్రే చేశానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

"""/"/ నేను ప్రొఫెషనల్ కాదని ప్రూవ్ చేస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని విశ్వక్ సేన్ వెల్లడించారు.

నా వల్ల ఏ నిర్మాత రూపాయి కూడా పోగొట్టుకోలేదని విశ్వక్ సేన్ వెల్లడించడం గమనార్హం.

మర్యాద లేకుండా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.అర్జున్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయకూడదని మాత్రమే నేను సైలెంట్ గా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు.

అర్జున్ గారిని ఎప్పుడూ అవమానించలేదని ఆయన ఫీలై ఉంటే మాత్రం సారీ అని విశ్వక్ సేన్ అన్నారు.

తన తప్పు లేదనే విధంగా విశ్వక్ సేన్ కామెంట్లు చేయడం గమనార్హం.

బడ్జెట్ 7 కోట్లు.. కలెక్షన్లు 75 కోట్లు.. ఈ హిట్ మూవీ ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!