అప్పట్లో చాలా కష్టాలు పడిన విశ్వ సుందరి…

సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ ఒక స్టేజ్ వచ్చాక అందరి దృష్టిని ఆకర్షిస్తారు, కానీ వాళ్ళు ఆ స్టేజ్ కి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డరనేది వాళ్ళకి మాత్రమే తెలుసు.

గ్లోబల్ స్టార్ ,మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) పేరు తెలియని వారుండరు.

అమ్మడు హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతోంది.బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ రెండు దశాబ్దాలుగా అగ్ర హీరోలందరితో ఆడిపాడి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కైవసం చేసుకున్న భామ క్రిష్, తుఫాన్( Krish, Thufan ) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లోనే సందడి చేస్తూ బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ప్రస్తుతం ఓ క్రేజీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్, సిటాడెల్ ( Citadel )తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం డేవిడ్ వెయిల్( David Weil ) రూపొందించారు.

రూసో బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ సిటాడెల్ ఏజెంట్లు గా నటించారు.

సిటడెల్‌ వెబ్‌సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా ఆమె నటనను అందరూ ఫిదా అవుతున్నారు.

అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో టైములో అందాల ముద్దుగుమ్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ లో ఎదురుకొన్న కొన్ని చేదు సంఘటనలను వెల్లడించారు.

ప్రస్తుతం అమ్మడు చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరాలవుతున్నాయి,.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ హైస్కూల్‌ విద్య కోసం అమెరికాకు వెళ్లిన కొత్తలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

"""/" / అయితే అక్కడివారితో ఎలా స్నేహంగా ఉండాలో మొదట్లో అర్ధం కాక చాలా భయపడ్డాను .

అయితే క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో అప్పట్లో నాకు తెలియదు.

ఇక వెండింగ్‌ మిషన్‌ నుంచి స్నాక్స్‌ తీసుకుని.ఎవరూ చూడనపుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లి తిని , ఆ తరువాత క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోయేదాన్ని.

ఇలా నాకున్న భయంతో చాలా రోజులపాటు ఎవరితో కలిసి తిరగలేదు ఆ భయంతోనే అలా ప్రవర్తించేదాన్ని.

ఇక నాలుగు వారాల పాటు అక్కడ ప్రతి విషయాన్ని గమనించి తెలుసుకున్న నాలో ధైర్యం పెరిగింది.

స్కూల్‌లో ఉన్న పిల్లలతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం కోసం నేను కొన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

అలాగే నా కుటుంబం గూర్చి చాల వివరించాను.ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళ్లడం, లేట్‌ నైట్‌ పార్టీలు.

మా పేరెంట్స్ ఒప్పుకోరని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పాను.

దాంతో వారు కూడా నాకు అనుకూలంగా ఉండేవారు.నేను వాళ్ళ కోసం కొన్ని మార్చుకుంటే .

వాళ్ళు నా ఫ్రెండ్షిప్ కోసము మరి కొన్ని మార్చుకున్నారు.అలా ఆ భయాలన్నింటినీ ఒక్కక్కటిగా పక్కనపెట్టడము వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని ప్రియాంకా చోప్రా వెల్లడించారు.

ఎన్టీఆర్ పై ఆరోపణలు… అలా చేస్తే హీరోలు అడుక్కు తినాల్సిందే.. ఫైర్ అయిన నటి!