అమ్మ అలా చెప్పుకోవాలని ఈ స్థాయికి వచ్చానన్న విష్ణుప్రియ.. తిండి కూడా లేదంటూ?
TeluguStop.com
టాలీవుడ్ పాపులర్ యాంకర్లలో విష్ణుప్రియ ( Vishnupriya ) ఒకరు కాగా పలు టీవీ షోల ద్వారా ఆమె పాపులర్ అయ్యారు.
సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసిన టీవీ షోలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.
బోల్డ్ గా కనిపించడానికి ఇష్టపడే విష్ణుప్రియ తాజాగా ఒక షోలో తన కన్నీటి కష్టాలను చెప్పుకోగా ఆమె వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
తాను చెన్నైలో పుట్టానని మా తల్లీదండ్రులది చీరాల అని ఆమె అన్నారు.ఆ తర్వాత మా ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ కావడం జరిగిందని విష్ణుప్రియ పేర్కొన్నారు.
ఒకే సమయంలో నంబర్ వన్ యారీ, పోవే పోరా షోలలో ఒకే సమయంలో అవకాశాలు రాగా అప్పట్లో తినడానికి సరైన తిండి కూడా లేదని అందువల్లే నేను సన్నగా కనిపించానని ఆమె కామెంట్లు చేశారు.
ఇప్పుడు మాత్రం తనకు ఆర్థిక కష్టాలు అయితే లేవని విష్ణుప్రియ అన్నారు. """/" /
మా అమ్మ( Vishnupriya Mother ) మూవీ ఇండస్ట్రీలో ఉందని ప్రముఖ హీరోయిన్లకు అమ్మ హెయిర్ డ్రెస్సర్ గా( Hair Dresser ) పని చేసినట్టు విష్ణుప్రియ వెల్లడించారు.
అమ్మకు భరతనాట్యం వచ్చని అమ్మ చాలా టాలెంటెడ్ అని విష్ణుప్రియ పేర్కొన్నారు.ఎంతో ప్రతిభ ఉన్న అమ్మ హెయిర్ డ్రెస్సర్ గా పని చేయడం నాకు నచ్చలేదని ఆమె అన్నారు.
విష్ణుప్రియ తల్లిగా అమ్మకు గుర్తింపు రావాలని నేను అనుకున్నానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. """/" /
కొన్ని నెలల క్రితం అమ్మ చనిపోయారని చెబుతూ విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు.
నేను చాలా సాధించానని ఫీలవుతానని ఆమె కామెంట్లు చేశారు.విష్ణుప్రియ కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కవర్ సాంగ్స్ చేయడం ద్వారా అమె పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.విష్ణుప్రియ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఊపు ఊపేస్తున్న మ్యాడ్ స్క్వేర్ ‘స్వాతి రెడ్డి’.. (వీడియో)