గుత్తాజ్వాలని పెళ్లాడబోతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసిన హీరో

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల, కోలీవుడ్ యువ హీరో విష్ణు విశాల్ మధ్య ప్రేమాయణం ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

వీరు ఎప్పటికప్పుడు తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.అయితే ప్రారంభంలో అందరి మాదిరిగానే మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

అయితే విషయం అందరికి తెలిసిపోయిన తర్వాత ఇద్దరం డేట్ లో ఉన్నామని ఒప్పుకున్నారు.

ఇక గుత్తాజ్వాల ఎప్పటికప్పుడు విష్ణు విశాల్ మీద తన ప్రేమని ఏదో ఒక రూపంలో చూపిస్తూ వస్తుంది.

అలాగే అవకాశం దొరికిన ప్రతీసారి విష్ణు విశాల్ కూడా గుత్తామీద తన అభిమానం చూపిస్తున్నాడు.

ఇద్దరికి గతంలో వేరొకరితో పెళ్ళిళ్ళు అయిపోయాయి.అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిన తర్వాత వారి వారి లైఫ్ పార్ట్ నర్స్ కి విడాకులు ఇచ్చేశారు.

ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉంటున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా విష్ణు విశాల్ గుత్తాజ్వాలతో పెళ్లి గురించి అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చేశాడు.

అరణ్య షూటింగ్ సమయంలో జ్వాలా గుత్తా నాకు పెద్ద సహకారిగా ఉంది.షూటింగ్ స్పాట్ లోనూ ఉంది.

మేము వివాహం చేసుకోబోతున్నాం.త్వరలో తేదీని ప్రకటిస్తాం.

నేను త్వరలో తెలుగింటి అల్లుడు కాబోతునున్నాను అని వెల్లడించారు.అరణ్య సినిమా ద్వారా విష్ణు విశాల్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమాలో తన పాత్ర తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

అలాగే తన నెక్స్ట్ తమిళ్ మూవీస్ ని రెండు బాషలలో ఒకే సారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

మొత్తాకిని ఈ కుర్ర హీరో గుత్తాజ్వాలని పెళ్లి చేసుకొని తెలుగింటి అల్లుడు అవ్వడంతో పాటు తెలుగు ప్రేక్షకులకి చేరువ అవ్వడానికి భాగా ప్లాన్ చేసుకున్నాడని ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

"""/"/ .

అమరావతిలో బసవతారకం హాస్పిటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన..!!