అప్పటికైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్?

తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన ఫొటోస్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.

అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు పాలాభిషేకాలు భారీ కటౌట్ లను నిర్మించారు.

అయితే కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలోని టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు కూడా ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ప్రభాస్ విష్ణు ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు బర్త్డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా తన 43 పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

దీంతో ప్రభాస్ కు అభిమానులు, సినిమా స్టార్స్, రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్డే విషెస్ లో వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా మంచు విష్ణు ట్వీట్ చేస్తూ.మరో తల్లికి పుట్టిన నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

"""/"/ వచ్చే పుట్టినరోజు నాటికి అతడు పెళ్లిచేసుకుంటాడో లేదో నాకు తెలీదు కానీ కచ్చితంగా అదిరిపోయే బ్లాక్‌ బస్టర్ అయితే ఇస్తాడు.

నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ అని రాసుకొచ్చాడు.అయితే మంచు విష్ణు బర్త్డే విషెస్ చెబుతూనే ప్రభాస్ పెళ్లి గురించి సెటైర్ కూడా వేశారు.

కాగా ఈ ట్వీట్ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.తిన్నగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఆ ఎక్స్‌ట్రాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా అతనిపై ట్రోలింగ్స్ చేస్తూ అతనిపై విరుచుకు పడుతున్నారు.

తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!