హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తో విష్ణు కొత్త సినిమా.. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!

తెలుగు ప్రేక్షకులకు నటుడు హీరో నిర్మాత మంచు విష్ణు( Manchu Vishnu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గత రెండు రోజులుగా మంచు విష్ణు పేరు సోషల్ మీడియాలో మారుమగుతున్న విషయం తెలిసిందే.

మంచు ఫ్యామిలీ గొడవల్లో భాగంగా మంచు విష్ణు పేరు మారుమోగుతోంది.మరోవైపు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప( Bhakta Kannappa ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీ దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. """/" / మోహన్‌బాబు, శరత్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న కన్నప్పలో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు.

ఏప్రిల్‌ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నటుడిగా నిర్మాతగా విద్యాసంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న మంచు విష్ణు ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేశారు.

తరంగా వెంచర్స్ పేరుతో తన మీడియా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు మంచు విష్ణు.

50 మిలియన్‌ డాలర్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థలో హాలీవుడ్‌ ప్రముఖ నటుడు విల్‌స్మిత్‌( Hollywood Actor Will Smith ) కూడా భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నట్లు విష్ణు తెలిపారు.

ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. """/" / త్వరలోనే ఇందుకు సంబంధించిన శుభవార్త వింటారని తెలిపారు విష్ణు.

కాగా తరంగ వెంచర్స్‌ ముఖ్యంగా ఇండస్ట్రీకి అవసరమయ్యే నూతన టెక్నాలజీస్‌ పై పెట్టుబడులు పెట్టనుంది.

ఓటీటీ వేదికలు, యానిమేషన్‌, గేమింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్‌, వీఆర్‌, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుందట.

అలాగే ఎంటర్టైన్మెంట్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోనుంది.తరంగ వెంచర్స్‌లో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్‌ ఝాలా, వినయ్‌ మహేశ్వరి, విల్‌స్మిత్‌, దేవేష్‌ చావ్లా, సతీష్‌ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు.

వీరే కాకుండా మరికొందరు కూడా తరంగ వెంచర్స్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇటు భారత్‌, అటు డెలవర్‌ లోనూ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కాగా ఈ తరంగా వెంచర్స్ కొత్త వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటుగా మార్గనిద్దేశత్వం స్టార్టప్స్‌ కు వ్యూహాత్మక ప్రణాళికలన అందించనుందట.

మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!