ఆ విషయంలో తారక్ ను వెనక్కి నెట్టిన మంచు విష్ణు..షాక్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు మంచు విష్ణు( Manchu Vishnu ) , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) వంటి వారు కూడా ఒకరు.

ఈ ఇద్దరు హీరోలకు ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది.

మోహన్ బాబు వారసుడుగా మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా, నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

ఇకపోతే మంచు విష్ణు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.

త్వరలోనే కన్నప్ప ( Kannappa ) అనే తన డ్రీం ప్రాజెక్టు ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

"""/" / విష్ణు ఇదివరకు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇటీవల కాలంలో ఈయన నటిస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే సరైన హిట్ కోసం విష్ణు ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ విషయంలో మాత్రం మంచు విష్ణు ఎన్టీఆర్ ను వెనక్కి నెట్టారని తెలిసి ఎన్టీఆర్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను అనుసరించే వారి సంఖ్య తక్కువగానే ఉంది.

"""/" / ఇలా ఇంస్టాగ్రామ్ ( Instagram ) లో ఎన్టీఆర్ ని కేవలం 7.

5 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఫాలో అవుతుండగా మంచు విష్ణు మాత్రం 8 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు.

ఇలా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయంలో మంచు విష్ణు ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టారు.

ఇక ఎన్టీఆర్ ఏదైనా సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించరు.

అందుకే ఈయనకు ఇంస్టాగ్రామ్ లో పెద్దగా ఫాలోవర్స్ లేరు అని చెప్పాలి.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి స్థానంలో అల్లు అర్జున్ అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకోగా రెండో స్థానంలో రామ్ చరణ్ మూడో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు.

నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?