ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు దేవ్..!!

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ మూడు రాష్ట్రాలలో విజయం సాధించటం తెలిసిందే.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీ( BJP ) అధికారాన్ని కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

రాయపూర్ లో ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ తదితర నేతల సమక్షంలో.

పదవి స్వీకార కార్యక్రమం జరిగింది.సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు.

అరుణ్ సావో, విజయ్ శర్మలతో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజన జనాభా 32 శాతం ఉండటంతో అదే వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయికి బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.

విష్ణు దేవ్( Vishnu Dev ) తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో ప్రారంభించారు.

1990లో తన స్వగ్రామంలో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అదే ఏడాది తప్కారా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1998 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగారు.ఆ తర్వాత ఏడాది 1999లో రాయగఢ్ లోక్ సభ నుంచి ఎంపీ కావడం జరిగింది.

ఆ తర్వాత 2006వ సంవత్సరంలో బీజేపీ పార్టీ.రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టడం జరిగింది.

2009, 2014లో మళ్లీ రాయగఢ్ ఎంపీ అయ్యారు.ఆ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర రాష్ట్ర ఉక్కుగనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పదవిని పొందడం జరిగింది.

ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించబడ్డారు.ఈ బలమైన రాజకీయ జీవితం కారణంగా.

విష్ణు దేవ్ సాయికి బీజేపీ పెద్దలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది.

డిసెంబర్ 11నే కీర్తి సురేష్ పెళ్లి… అధికారికంగా ప్రకటించిన తండ్రి సురేష్!