Vishal: స్టార్ హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన విశాల్..!!

కోలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు విశాల్ ( Vishal ).

అయితే ఈయన తెలుగువాడైనప్పటికీ తమిళ ఇండస్ట్రీని ఏలారు.అలాగే విశాల్ నటించిన సినిమాలు ఎన్నో తెలుగులో కూడా విడుదలై హిట్ అవుతాయి.

"""/" / ఇక సినిమాల్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న విశాల్ కెరియర్ పర్సనల్ లైఫ్ లో మాత్రం అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ హీరో 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు.

ఇక గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sharath Kumar ) తో ఈయనకు ఎఫైర్ ఉందని, పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ అది నిజం కాలేదు.

అలాగే అనీషా రెడ్డి ( Anisha Reddy ) అనే అమ్మాయితో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని తీరా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు.

ఇక ఆమె ఓ వ్యాపారవేత్తని పెళ్లిచేసుకొని సెటిల్ అయింది.ఇక సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అభినయ ( Abhinaya ) అనే నటిని కూడా విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు.అయితే తాజాగా విశాల్ ఆ హీరోయిన్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా మొత్తం వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.ఆమె ఎవరో కాదు మలయాళ, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన లక్ష్మీ మీనన్ ( Lakshmi Menon ).

కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.లక్ష్మీ మీనన్ తో విశాల్ పాండియనాడు,ఇంద్రుడు వంటి సినిమాలు చేశారు.

"""/" / ఇక ఈ సినిమాల్లో నటిస్తున్న టైం లోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్తా ప్రేమ వరకు దారితీసిందని,త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ మధ్యకాలంలో విశాల్ (Vishal) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకుంటాను.

ఆ విషయాన్ని మీకు చెబుతాను అని చెప్పడం ప్రస్తుతం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

దాంతో విశాల్ అభిమానులందరూ మా అభిమాన హీరో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సంబర పడుతున్నారు.

కానీ కొంతమంది మాత్రం ఈ విషయం స్వయంగా విశాల్ చెప్పే వరకు మేము నమ్మం అని కొట్టి పారేస్తున్నారు.

మరి విశాల్ పెళ్లి చేసుకునే విషయం నిజామా అబద్ధమా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?