ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి.. డార్లింగ్ పెళ్లితో లింక్ పెట్టుకున్న హీరో విశాల్?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేరు వినగానే ప్రభాస్ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది.
నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికే అలాగే ఉన్న విషయం తెలిసిందే.
అదిగో ఇప్పుడు చేసుకుంటా ఇదిగో అప్పుడు చేసుకుంటా అంటూ పెళ్లి మాటని దాటేస్తూ వస్తున్నారు ప్రభాస్.
బాహుబలి సినిమా తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించినప్పటికీ బాహుబలి తర్వాత దాదాపు నాలుగు సినిమాలు పూర్తి అవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు ప్రభాస్.
దీంతో అభిమానులకి తమ అభిమాన హీరో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో ఇదే విషయం గురించి ప్రభాస్ ను అడిగి అభిమానులు విసిగిపోయారు.ఇది ఇలా ఉంటే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది తెలియక అభిమానులు తలకోక్కుంటుంటే ఇంతలో మరొక హీరో ప్రభాస్ పెళ్లితో లింకు పెట్టుకునే ప్రభాస్ పెళ్లి అయ్యేవరకు తాను కూడా పెళ్లి చేసుకోను అని అంటున్నాడు.
ఆ హీరో ఎవరు అన్న వివరాల విషయానికొస్తే.ఆ హీరో మరెవరో కాదు విశాల్తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లాఠీ.
ఈ సినిమా డిసెంబర్ 22 న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
"""/"/
ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం అలాగే హీరో విశాల్ బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక రిపోర్టర్ విశాల్ ని మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.
ఆ విషయం పై స్పందించిన హీరో విషయాలు కెరియర్ పరంగా చాలా బాధ్యతలు నాపై ఉన్నాయి.
పెళ్లి అనేది జోకు కాదు కదా నాకైతే ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అయితే రాలేదు.
అదేవిధంగా ప్రభాస్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో నేను అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు హీరో విశాల్.
ఇకపోతే ఇటీవల విశాల్ హీరోయిన్ అభినయని ని పెళ్లి చేసుకోనున్నాడని, త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటించనున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ వార్తలపై ఇంకా క్లారిటీ రాకుండా విశాల్ ఈ విధంగా సమాధానం ఇవ్వడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.