మరోసారి షూటింగ్లో గాయపడిన విశాల్?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమా షూటింగులలో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి పెద్ద ఎత్తున సాహసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి వరుసగా సెలబ్రిటీలు ప్రమాదాలకు గురి కావడం అందరిని షాక్ కి గురిచేస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు శిల్పా శెట్టి, టబు ఇలాంటి ప్రమాదాలకు గురైన వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి.

అయితే ఈ విషయం మర్చిపోకముందే కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో ప్రమాదానికి గురైనట్లు చిత్ర బృందం వెల్లడించారు.

ప్రస్తుతం విశాల్ లాఠీ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో ఈయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరో విశాల్ ప్రమాదానికి గురయ్యారు.

ఈయనకు ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో కొద్దిరోజుల పాటు షూటింగ్ ఆపివేశారు. """/"/ ఈ క్రమంలోనే విశాల్ కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే నేటి ఉదయం(ఆగస్టు 11) ఈ సినిమా షూటింగ్లో భాగంగా భారీ యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో మరోసారి విశాల్ ప్రమాదానికి గురయ్యారు.

ఈ ఘటనలో విశాల్ తీవ్రంగా గాయపడడంతో వెంటనే మార్క్ ఆంటోనీ సినిమా షూటింగ్ నిలిపివేసి ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇలా విశాల్ తరచూ ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇద్దరమ్మాయిలు ప్రేమించి మోసం చేశారు.. షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!