విశాల్- ఎ.వినోద్‌ కుమార్‌ -రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా మూవీ 'లాఠీ'టీజర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ'.

హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం టీజర్ ని విడుదలైయింది.

1నిమిషం 38సెకన్ల నిడివి గల లాఠీ 'టీజర్' ఫుల్ పవర్ ప్యాక్డ్ గా వుంది.

వంటినిండా గాయాలు, చేతికి కట్లు వున్న విశాల్.చుట్టుముట్టిన రౌడీ మూకలని చూస్తూ.

“రేయ్.తప్పు చేసి తలదాచుకునే పోకిరివి.

నీకే ఇంత పొగరున్నప్పుడు.ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని.

నాకు ఎంత పొగరుంటుంది” అని వార్నింగ్ ఇవ్వడం పోలీస్ పవర్ ని చూపించింది.తర్వాత వచ్చిన ఎపిసోడ్‌లో విశాల్ తన సీనియర్ అధికారులకు సెల్యూట్ చేస్తూ డ్యూటీని నిజాయితీగా చేసి పోలీస్ గా కనిపించారు.

ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న భవనంలో వచ్చిన భారీ యాక్షన్ బ్లాక్ అద్భుతంగా వుంది.

బిల్డింగ్ లో వరుసగా లైట్లు వెలగడం, గుంపులుగా రౌడీలు రావడం, విశాల్ రౌడీ మూకలపై యుద్ధాన్ని ప్రకటించడం టెర్రిఫిక్ గా వుంది.

విధిని నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయని పోలీసు పాత్రలో విశాల్ నటన బ్రిలియంట్ గా వుంది.

దర్శకుడు వినోద్ కుమార్ విశాల క్యారెక్టర్‌ని మాస్‌గా ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు.

టెక్నికల్ గా టీజర్ అత్యున్నతంగా వుంది.పీటర్ హెయిన్ డిజైన్ చేసిన స్టంట్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లాక్స్ అని అద్భుతంగా ఆవిష్కరించాయి.టీజర్ కి సామ్ సిఎస్ అందించిన నేపధ్య సంగీతం యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది.

బాలసుబ్రమణియన్ యాక్షన్ సీన్స్ ని యాక్షన్ ఫీస్ట్ గా చిత్రీకరించారు.నిర్మాణ విలువలు భారీ వున్నాయి.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో సాగిన ఈ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బాలసుబ్రమణ్యన్‌ ఛాయాగ్రహకుడిగా, సామ్‌ సిఎస్‌ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు.

సెప్టెంబర్ 15న 'లాఠీ' అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

H3 Class=subheader-styleతారాగణం:/h3p విశాల్, సునైనా H3 Class=subheader-styleసాంకేతిక విభాగం:/h3p దర్శకత్వం: ఎ.వినోద్‌,నిర్మాతలు: రమణ, నంద,బ్యానర్: రానా ప్రొడక్షన్స్,రచయిత: పొన్ పార్థిబన్,సంగీతం: సామ్ సిఎస్,ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యన్‌ స్టంట్ మాస్టర్స్: పీటర్ హెయిన్,ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి,పీఆర్వో: వంశీ-శేఖర్.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?