విశాఖపట్నం జిల్లాలో ఏకంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకడం సంచలనంగా మారింది.గోపాలపట్నం, ఎల్లపు వారి పాలెం జిల్లా పరిషత్ విద్యార్థులకు కరోనా సోకడం జరిగింది.
పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కలకలం రేగింది.
ఎల్లపువారి పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు అలాగే కొత్తపట్నం చెందిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వారి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు స్కూల్ ప్రాంగణం వద్ద విద్యార్థుల ఇంటివద్ద శానిటేషన్ నిర్వహించారు.
ఒకే స్కూల్ కి చెందిన ఆరుగురు విద్యార్థులకు కరోనా రావటంతో.విశాఖ జిల్లాలో విద్యాశాఖ తో పాటు ప్రభుత్వం అలర్ట్ అయ్యి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో కరుణ నిబంధనలు కఠినంగా అమలు అయ్యేలా.
అధికారులను అదేరీతిలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేస్తూ ఉంది.