`విశాఖ ఉక్కు`.. ఈ రెండు పార్టీల‌కూ దెబ్బేనా…?

రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రిస్తున్న విష‌యం.

రాష్ట్ర రాజ‌కీయా ల‌ను వేడెక్కించింది.ముఖ్యంగా అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య ఇది రాజ‌కీయ యుద్ధానికి తెర‌తీసింది.

అయితే.ఈ విష‌యంలో ఈ రెండు పార్టీల‌కూ మేలు జ‌రిగే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎవ‌రు ఎలా వ్య‌వ‌హ‌రించినా.విశాఖ ఉక్కు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించి.

నిల‌బెట్టుకోలేక పోతే.క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే సంకేతాలు వ‌స్త‌న్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు అయితే.వైసీపీదే త‌ప్ప‌ని.

చంద్ర‌బాబు, కాదు.చంద్ర‌బాబుదే అంతా నేర‌మ‌ని వైసీపీ వ్యాఖ్య‌లు చేసింది.

ఇది ఎలా చూసినా.ప్ర‌జ‌లు కోరుకుంటున్న అభిప్రాయానికి భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

విశాఖ ఉక్కు  విష‌యం తెర‌మీదికి రాగానే.చంద్ర‌బాబు  జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు సంధించారు.

దీనిని కొనేసేందుకు ఎత్తుగ‌డ వేశార‌ని. విశాఖ ఉక్కును జ‌గ‌న్ అండ్ కో దోచేసుకుంటున్నార‌ని.

ఇప్ప‌టికే విశాఖ‌లో భూములు క‌బ్జా చేశార‌ని.గ‌నులు దోచేస్తున్నార‌ని.

చంద్ర‌బాబు పాడిందే పాట అన్న‌ట్టుగా విమ‌ర్శ‌లు చేశారు.ఇక‌, ఈ విష‌యంపై ఆచితూచి మాట్లాడాల్సిన మంత్రులు గౌతంరెడ్డి, బొత్స స‌త్యానారాయ‌ణ‌లు విశాఖ ఉక్కు ప్రైవేటీ క‌ర‌ణం.

చంద్ర‌బాబు హ‌యాంలోనే సాగింద‌ని.రేపు ఇది ప్ర‌వేటుకు అమ్మేస్తే.

దానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని.  వైసీపీకి ఎలాంటి పాత్రా లేద‌ని.

సీనియ‌ర్ మంత్రి.బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

"""/"/ ఇక‌, మంత్రి గౌతం రెడ్డి విశాఖ ఉక్కును అమ్మేస్తే.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని అన్నారు. ఈ విష‌యంలో త‌న‌ది హామీ అని ప్ర‌క‌టించుకున్నారు.

నిజానికి ఇలా రెండు పార్టీల కీల‌క నేత‌లు వ్యాఖ్యానించ‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఒక‌వైపు.టీడీపీ అధినేత చంద్ర‌బాబు.

ఇటు వైసీపీ మంత్రులు ఇలా బాధ్య‌తా రాహిత్యంగాకామెంట్లు చేయ‌డం.స‌రికాద‌నే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలా చేసే ప్ర‌త్యేక హోదా ను రాకుండా చేశార‌ని.ఇప్పుడు విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నిల‌బెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌పాల్సిన నాయ‌కులు, పార్టీలు ఇలా కొట్లాట‌కు దిగ‌డం ప‌రిపాటికాద‌ని అంటున్నారు.

ఇది నిజ‌మే.రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు.

ఇలా ఎవ‌రికి వారు దుమ్మెత్తి పోసుకుంటే.ప్ర‌యోజ‌నం ఏంట‌నేది కీల‌క‌ప్ర‌శ్న‌.

మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు మార‌క‌పోతే.మున్ముందు ప్ర‌జాగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ?