విశాఖ టీడీపీ మేయర్… వైసీపీ ఎత్తుకు ట్విస్ట్‌తో టీడీపీ పై ఎత్తు ?
TeluguStop.com
ఏపీలో తెలుగుదేశం పార్టీకి తాజా పురపోరులో చాలా తక్కువ ఆశలు ఉండగా.విశాఖ మేయర్ పీఠం మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఉంది.
ఉక్కు ఉద్యమం ఎఫెక్ట్‌తో పాటు గత ఎన్నికల్లో నగరంలో నాలుగు సీట్లను గెలుచుకున్న ఊపును కంటిన్యూ చేయాలంటే విశాఖ మేయర్ పీఠంపై పసుపు జెండా ఎగరవేయాలని ఎంతో పట్టుదలతో ఉంది.
ఈ క్రమంలోనే ఎన్నో ఈక్వేషన్లు.ఎత్తులతో విశాఖలో టీడీపీ రాజకీయం నడిపిస్తోంది.
ఇప్పటికే వైసీపీ తమ మేయర్ అభ్యర్థి నగర పార్టీ అధ్యక్షుడు, బీసీల్లో బలమైన వంశీకృష్ణ శ్రీనివాస్‌ను దాదాపు ఖరారు చేసేసింది.
సీఎం జగన్ నుంచే ఆయనకు హామీ వచ్చిందంటున్నారు.టీడీపీ మేయర్ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా వైసీపీ వేసిన ఎత్తుగడకు ధీటైన ఎత్తుగడే వేయాలని భావించి.
మేయర్ అభ్యర్థి విషయంలో సక్సెస్ అయ్యింది.జీవీఎంసీ పరిధితో పాటు విశాఖ జిల్లాలో బీసీల్లోనే మరో బలమైన సామాజిక వర్గంగా ఉన్న గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా తెరమీదకు తీసుకువచ్చింది.
అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సోదరుడే శ్రీనివాస్.పీలా శ్రీనివాస్‌కు అంగ బలంతో పాటు ఆర్థిక బలం కూడా ఎక్కువే.
"""/"/
గవర సామాజిక వర్గం ఓటర్లు నగరంతో పాటు పెందుర్తి, అనకాపల్లి, గాజువాక ఏరియాల్లో చాలా ఎక్కువుగా ఉన్నారు.
వీరిని ఆకర్షించే క్రమంలోనే టీడీపీ వైసీపీకి ధీటుగా అదిరిపోయే స్కెచ్ వేసి పీలా శ్రీనివాస్‌ను మేయర్ అభ్యర్థిగా తెరమీదకు తెచ్చింది.
వైసీపీ బలంగా ఉన్న యాదవుల ఓట్లను ఆకర్షించాలని వంశీకృష్ణను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే.
యాదవుల్లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇప్పటకే విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో మేయర్ అభ్యర్థిగా గవర వర్గం వ్యక్తిని ఎంపిక చేసింది.
ఈ పదవి కోసం పీలా శ్రీనివాసరావుతో పాటు మైనార్టీ వర్గం నుంచి నజీర్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కాకి గోవిందరెడ్డి పోటీ పడ్డారు.
గండి బాబ్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పదవి తనకే ఇవ్వాలని.పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తానే ఏ పదవి ఆశించలేదని అధిష్టానంపై గట్టి ఒత్తిడి తెచ్చారు.